Homeఅంతర్జాతీయంIran Red Flag News: ప్రపంచాన్ని భయపెడుతున్న ఇరాన్‌ రెడ్‌ ఫ్లాగ్‌..

Iran Red Flag News: ప్రపంచాన్ని భయపెడుతున్న ఇరాన్‌ రెడ్‌ ఫ్లాగ్‌..

Iran Red Flag News: సాధారణంగా మసీదులపై ముస్లింలు ఆకుపచ‍్చ రంగు జెండాలు ఎగురవేస్తారు. జెండానే పరమ పవిత్రంగా భావిస్తారు. అయితే ఇరాన్‌లోని సమ్కరన్‌ మసీదుపై ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ ఎర్రజెండా ఎగురవేశారు. ఇదే ఇప్పుడు‍ప్రపంచాని‍్న ఆందోళనకు గురిచేస్తోంది. అణు కార్యక్రమాలు చేస్తుందన్న సాకులో మిడిల్‌ ఈస్ట్‌లో అమెరికా చిచ్చు పెట్టింది. ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌..ఇజ్రాయెల్‌తో కలిసి దాడి చేశాడు. ఫిబ్రవరి 28 మొదలైన యుద్ధంలో తొలిరోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణించాడు. మరుసటి రోజు నుంచి ఇరాన్‌ ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. ఇజ్రాయెల్‌తోపాటు గల్‌‍‍్ఫ దేశాలపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ఖమేనీ మరణం తర్వాత జమ్కరన్ మసీదిపై ఎర్ర జెండా ఎగురవేశారు. దీనిని ప్రతీకార దాడికి చిహ‍్నంగా మారింది.

Also Read: తెలంగాణ రాష్ట్ర ఖజానా ‘నిల్’నా?

పోరాటానికి చిహ్నం..
ఎర్ర జెండా అంటేనే పోరాటానికి చిహ్నం. ప్రపంచంలో అనేక విప్లవాలు ఎర్రజెండా పట్టుకునే చేశారు. ఇప్పుడు ఇరాన్‌ కూడా షియా సంప్రదాయంలో ఈ గుర్తు అన్యాయానికి గురైనవారి హత్యలకు ప్రతీకారం పోరాటాన్ని సూచిస్తూ సమ్కరన్‌ మసీదుపై ఎగురవేశారు. ఖమేనీ మరణానికి దోహదపడినవారిపై కఠోర చర్యలు తీసుకుంటామని రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించడంతో ఈ జెండా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది మతపరమైన ధైర్యాన్ని, దీర్ఘకాల పోరాటాన్ని ప్రతిబింబిస్తుంది.

తొలి రోజే ఖమేనీ మరణం..
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో టెహ్రాన్‌లో ఖమేనీ మరణించారు. మష్హాద్‌లో 1939లో జన్మించిన ఆయన ఇరాన్ విప్లవ సమయం నుంచి అధికారంలో ఉండి, దశాబ్దాలు పాలన చేశారు. దేశంలో నిరసనలు, కొన్ని చోట్ల ఆనంద వ్యక్తీకరణలు కలిసిపోయాయి. ట్రంప్ ఖమేనీని క్రూరుడిగా అభివర్ణించి, ఇరాన్ ప్రజల స్వాతంత్ర్యానికి అవకాశమని చెప్పారు. నెతన్యాహు విప్లవానికి మద్దతు తెలపడంతో ఇజ్రాయెల్ సైన్యం ఆయనను ప్రాంతీయ విఘ్నకర్తగా చిత్రీకరించింది.

తాత్కాలిక పాలన..
శూన్యత భర్తీకి ముగ్గురు ఉన్నతాధికారుల మండలి ఏర్పడింది. అలీరెజా అరాఫీ ధర్మాధికారిగా, మసూద్ పెజెష్కియాన్ అధ్యక్షుడిగా, గోలమ్ హొస్సేన్ మొహ్సేని ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఎక్స్‌పర్ట్స్ అసెంబ్లీ త్వరలో శాశ్వత అగ్రనేతను ఎంపిక చేస్తుంది, ఇది అంతర్గత శక్తి సమతుల్యతను పరీక్షిస్తుంది.

ఖమేనీ మరణం ఇరాన్‌లో అంతర్గత విభేదాలను పెంచుతూ, ప్రతీకార దాడులను ప్రేరేపిస్తుంది. మసీదు జెండా ప్రపంచ శాంతికి సవాలుగా మారింది. దౌత్య ప్రయత్నాలు తప్పనిసరి. పాలన మార్పులు దీర్ఘకాల భద్రతను ప్రభావితం చేస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper