Homeఅంతర్జాతీయంIndia Israel Strategic Partnership History: భారత్‌కు అమెరికాను మించిన సాయం... ఇది కదా స్నేహమంటే

India Israel Strategic Partnership History: భారత్‌కు అమెరికాను మించిన సాయం… ఇది కదా స్నేహమంటే

India Israel Strategic Partnership History: భారత ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం ఇజ్రాయెల్‌ వెళ్లారు. ఈ పర్యటన భారత్‌కు అతి కీలకమైనదిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్‌–ఇజ్రాయెల్‌ సంబంధాలు కేవలం ఆధునిక ఒప్పందాలకు మాత్రమే పరిమితం కాదు.. దశాబ్దాలుగా రహస్య సహకారంతో ముడిపడి ఉన్నాయి. ఈ దౌత్య బంధం రక్షణ, సాంకేతికతల్లో కీలక పాత్ర పోషిస్తోంది. Also Read: లోకేష్ తలచుకుంటే అంతే! 1971 యుద్ధ సమయంలో రహస్య సహాయం దౌత్య సంబంధాలు లేనప్పటికీ […]

India Israel Strategic Partnership History: భారత ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం ఇజ్రాయెల్‌ వెళ్లారు. ఈ పర్యటన భారత్‌కు అతి కీలకమైనదిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్‌–ఇజ్రాయెల్‌ సంబంధాలు కేవలం ఆధునిక ఒప్పందాలకు మాత్రమే పరిమితం కాదు.. దశాబ్దాలుగా రహస్య సహకారంతో ముడిపడి ఉన్నాయి. ఈ దౌత్య బంధం రక్షణ, సాంకేతికతల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

Also Read: లోకేష్ తలచుకుంటే అంతే!

1971 యుద్ధ సమయంలో రహస్య సహాయం
దౌత్య సంబంధాలు లేనప్పటికీ ఇజ్రాయెల్‌ 1971లో భారత్‌కు ఆయుధాలు, శిక్షణ అందించి అమెరికా ఒత్తిళ్లను ఎదిరించింది. ఈ రహస్య చర్య భారత విజయానికి ముఖ్య కారణమైంది. ఇది రెండు దేశాల మధ్య విశ్వాసానికి మొదటి గుర్తింపు.

పాక్‌ అణు కేంద్రానికి చెక్‌ పేట్టేందుకు..
ఇక 1980లో పాకిస్తాన్‌ అణు కార్యక్రమాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్‌ ధ్వంసా అధికారం సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదన భారత భద్రతా ఆందోళనలను పరిష్కరించే స్పూర్తిని చూపింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు రెండు దేశాలను వ్యూహాత్మకంగా దగ్గర చేశాయి. ఇరు దేశాల బందాన్ని బలోపేతం చేశాయి.

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో..
ఇక ఇటీవల ఆపరేషన్‌ సిందూర్‌కు ఇజ్రాయెల్‌ పూర్తి మద్దతు ఇచ్చింది. పాకిస్తాన్‌కు టర్కీ డ్రోన్లు అందించింది. వాటితో భారత్‌పై పాకిస్తాన దాడికి యత్నించింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌ భారత్‌ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ అందించింది. దీంతో భారత సైన్య పాకిస్తాన్‌ డ్రోన్లను సమర్థవంతంగా తిప్పికొట్టింది. నెతన్యాహు గతంలో ఐక్యరాజ్యసమితిలో వాషింగ్టన్‌ కంటే ఢిల్లీనే ఎక్కువగా నమ్ముతామని చెప్పారు. రక్షణ, వ్యవసాయం, అఐ రంగాల్లో సహకారం ఇప్పుడు అభివృద్ధి చెందుతోంది.

ఈ చరిత్రాత్మక సంఘటనలు రెండు దేశాల సంబంధాన్ని విశ్వాసంతో బలపరుస్తున్నాయి. భవిష్యత్తులో సైబర్‌ భద్రత, డ్రోన్‌ సాంకేతికతల్లో మరిన్ని భాగస్వామ్యాలు ఆశిస్తున్నాయి. ఇది భారత్‌ మధ్యప్రాచ్య వ్యూహంలో కీలకమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper