Homeఅంతర్జాతీయంGlobal Gas Shortage Impact On Telecom Towers: గ్యాస్‌ కొరత: మొబైల్, ఇంటర్నెట్‌పై ప్రభావం?

Global Gas Shortage Impact On Telecom Towers: గ్యాస్‌ కొరత: మొబైల్, ఇంటర్నెట్‌పై ప్రభావం?

Global Gas Shortage Impact On Telecom Towers: ఇరాన్, అమెరికా – ఇజ్రాయెల్‌ యుద్ధం కొనసాగుతోంది. నాలుగు రోజుల్లో ముగుస్తుదనుకున్న యుద్ధం 11 రోజులు దాటింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను చంపేసినా ఆ దేశం తలొగ్గడం లేదు. ప్రతీకార దాడులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 దేశాలను యుద్ధంలోకి లాగింది. ఈ యుద్ధం ఇప్పుట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు ప్రపంచ దేశాల్లో ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయి. దీంతో క్రూడాయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌ […]

Global Gas Shortage Impact On Telecom Towers: ఇరాన్, అమెరికా – ఇజ్రాయెల్‌ యుద్ధం కొనసాగుతోంది. నాలుగు రోజుల్లో ముగుస్తుదనుకున్న యుద్ధం 11 రోజులు దాటింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను చంపేసినా ఆ దేశం తలొగ్గడం లేదు. ప్రతీకార దాడులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 దేశాలను యుద్ధంలోకి లాగింది. ఈ యుద్ధం ఇప్పుట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు ప్రపంచ దేశాల్లో ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయి. దీంతో క్రూడాయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌ ఆయిల్‌ ధరలు పెంచింది. తాజాగా శ్రీలంక కూడా పెంచింది. ఇక ఎల్‌పీజీ కొరతతో భారత దేశంలో వ్యాపారాలు నిలిచిపోతున్నాయి. చైనా, బంగ్లాదేశ్, జపాన్‌ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఎల్‌పీజీ కొరత టెలికాం టవర్‌ తయారీని ప్రభావితం చేస్తూ మొబైల్, ఇంటర్నెట్‌ సేవలపై అనుకూల ప్రభావం చూపనుంది. టవర్ల గాల్వనైజేషన్‌ ప్రక్రియకు గ్యాస్‌ సరఫరా ఆగితే నెట్‌వర్క్‌ విస్తరణ మందగించవచ్చు.

Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?

గ్యాస్‌ కొరత ప్రభావం..
టెలికాం టవర్ల తయారీలో జింక్‌ పొర వేసే గాల్వనైజేషన్‌కు ఎల్‌పీజీ లేదా ఎల్‌ఎన్‌జీ అవసరం. ఈ ప్రక్రియలో గ్యాస్‌ సప్లై ఆగితే ఉత్పత్తి ఆపేయాల్సి వస్తుందని తయారీదారులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల టవర్ల సరఫరా ఆలస్యం కావచ్చు. టవర్ల లేకపోతే మొబైల్‌ నెట్‌వర్క్, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ బలహీనపడుతుంది. ప్రస్తుత గ్యాస్‌ సంక్షోభం ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లను ప్రభావితం చేసినట్టు టెలికాం విస్తరణకు ఆటంకం కలగలదు. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సేవలు మందగిస్తాయి.

ఆర్థిక, సాంకేతిక పరిణామాలు
ఈ కొరత టెలికాం కంపెనీల ఖర్చులు పెంచుతూ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ప్రభుత్వం గ్యాస్‌ నిల్వలు పెంచి సరఫరాను స్థిరపరచాలి. లేకపోతే డిజిటల్‌ ఆధారిత సేవలు దెబ్బతింటాయి. టవర్‌ తయారీకి ప్రత్యామ్నాయ ఆక్సిజన్‌ ఆధారిత పద్ధతులు అవసరం.

తయారీదారులు గ్యాస్‌ పునరుత్పాదక యూనిట్లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం టెలికాం మొదటి ప్రాధాన్యత ఇచ్చి సప్లై చేయాలి. ఇలా చేస్తే కనెక్టివిటీ అంతరాయాలు తగ్గుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper