Homeక్రీడలుక్రికెట్‌Amit Mishra Wife Allegations: ఎప్పటికీ అదే యావ.. వందల మందితో సంబంధాలు.. క్రికెటర్ అమిత్...

Amit Mishra Wife Allegations: ఎప్పటికీ అదే యావ.. వందల మందితో సంబంధాలు.. క్రికెటర్ అమిత్ మిశ్రాపై భార్య సంచలన ఆరోపణలు!

Amit Mishra Wife Allegations: ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్న అమిత్ మిశ్రా తీవ్రమైన వివాదాలలో చిక్కుకున్నాడు. అతడి భార్య కాన్పూర్ కోర్టులో కేసు నమోదు చేసింది. విడాకులు కావాలని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా అమిత్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు కాస్త మీడియా ద్వారా సభ్య సమాజానికి తెలిసాయి. ఫలితంగా అమిత్ మిశ్రా అసలు కోణం బయటపడింది.

Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?

అమిత్ మిశ్రా గరీమా తివారి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మొదట్లో భార్యతో సక్రమంగానే ఉండేవాడు. ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమిత్ తనలో ఉన్న అసలు రూపాన్ని భార్యకు చూపించడం మొదలుపెట్టాడు. తను అనారోగ్యంగా ఉన్నప్పటికీ శారీరకంగా కలవాలని ఇబ్బంది పెట్టేవాడు. ఆమెను శారీరకంగా ఇబ్బంది పెట్టేవాడు. అదే కాదు చాలామంది యువతులతో సంబంధాలు కొనసాగించేవాడు. గరీమా ముందు ఇతర యువతులతో మాట్లాడేవాడు. అతడు కొనసాగించిన చాట్.. ఇతర వివరాలను గరీమా ఇటీవల బయటపెట్టింది. అతని మీద ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళితే.. అమిత్ తనకున్న పలుకుబడితో కేసు నమోదు కాకుండా చూశాడు. దీంతో ఆమె కాన్పూర్ కోర్టు దాకా వెళ్ళింది. తనకు అమిత్ నుంచి విడాకులు కావాలని కోరింది.

అమిత్ పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక గరీమ ఒకసారి ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.. గరిమా వివాహానికి ముందు మోడలింగ్ చేసేది. అయితే ఆమె మోడలింగ్ చేయడం అమిత్ కు ఏమాత్రం ఇష్టం లేదు.. దీంతో ఆమెను మోడలింగ్ కు దూరం చేశాడు. అమిత్ గరిమా కంటే ముందు చాలామందితో సంబంధాలు కొనసాగించాడు. ప్రేమ పేరుతో వారితో కలిసి తిరిగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అతడి వల్ల చాలామంది అమ్మాయిలు మోసపోయారు. ఇదే విషయాన్ని గరీమా తన ఫిర్యాదులో పేర్కొంది. అమిత్ విపరీతంగా వేధిస్తున్న నేపథ్యంలో అతడి నుంచి విడాకులు కావాలని.. కోటి రూపాయలను తనకు పరిహారంగా ఇప్పించాలని ఆమె తన పిటిషన్ లో కోరింది.

గరీమా ఫిర్యాదు నేపథ్యంలో అమిత్ మిశ్రా రాజస్థాన్ జట్టులో ఆడతాడా? అతడిని రాజస్థాన్ యాజమాన్యం జట్టులో ఉంచుకుంటుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ వివాదంపై అమిత్ ఇంతవరకు నోరు మెదపలేదు. గరీమా, అమిత్ వ్యవహారం జాతీయ మీడియాలో విపరీతంగా నానుతోంది. వర్ధమాన ఆటగాడిగా ఉన్న అమిత్ ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కోవడం అతడి కెరియర్ ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular