Homeఅంతర్జాతీయంH-1B Visa: హెచ్‌–1బీ వీసాకు ఫుల్‌ డిమాండ్‌.. ఫీజు పెంచినా 2 లక్షల దరఖాస్తులు!

H-1B Visa: హెచ్‌–1బీ వీసాకు ఫుల్‌ డిమాండ్‌.. ఫీజు పెంచినా 2 లక్షల దరఖాస్తులు!

H-1B Visa: అమెరికా ఫస్ట్‌ నినాదంతో డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చారు. ఈమేరకు అనేక చర్యలు చేపట్టారు. అక్రమంగా ఉంటున్నవారిని సొంత దేశాలకు పంపించారు. వీసా నిబంధనలు కఠినతరం చేశారు. అమెరికా కంపెనీలు స్వదేశీయులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. తాజాగా హెచ్‌–1బీ వీసా ధరలను లక్ష డాలర్లకు పెంచారు. అంటే భారత కరెన్సీలో రూ.88 లక్షలు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ, ఆశ్చర్యకరంగా దరఖాస్తుదారుల డిమాండ్‌ ఏమాత్రం తగ్గలేదు. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే […]

H-1B Visa: అమెరికా ఫస్ట్‌ నినాదంతో డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చారు. ఈమేరకు అనేక చర్యలు చేపట్టారు. అక్రమంగా ఉంటున్నవారిని సొంత దేశాలకు పంపించారు. వీసా నిబంధనలు కఠినతరం చేశారు. అమెరికా కంపెనీలు స్వదేశీయులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. తాజాగా హెచ్‌–1బీ వీసా ధరలను లక్ష డాలర్లకు పెంచారు. అంటే భారత కరెన్సీలో రూ.88 లక్షలు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ, ఆశ్చర్యకరంగా దరఖాస్తుదారుల డిమాండ్‌ ఏమాత్రం తగ్గలేదు. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 2.86 లక్షల హెచ్‌–1బీ దరఖాస్తులు వచ్చాయని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) కార్యదర్శి మార్క్‌వేన్‌ ముల్లిన్‌ వెల్లడించారు. వీటిలో రెండు లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు లక్ష డాలర్ల ఫీజు చెల్లించి ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రాసెసింగ్‌ (15 రోజుల్లో) పొందారు. మిగిలినవి సాధారణ ప్రాసెసింగ్‌లో 7.5 నెలలు పడుతున్నాయి.

విదేశీయులను నియంత్రించాలని..
ఫీజు పెంపు వెనుక ఉన్న ఉద్దేశంట్రంప్‌ ప్రభుత్వం ఈ చర్యను ‘‘అమెరికా కార్మికులను రక్షించడం, విదేశీ సస్తమైన లేబర్‌ను నియంత్రించడం’’ అనే లక్ష్యంతో తీసుకుంది. వీసా ద్వారా విదేశీ నిపుణులను భారీ సంఖ్యలో తీసుకురావడం వల్ల స్థానికులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని, టెక్‌ కంపెనీలు సులభంగా విదేశీయులను నియమించుకుంటున్నారని ఆరోపించింది. దీన్ని అరికట్టడానికి ఒక రకమైన ‘‘ట్యాక్స్‌ ఆన్‌ ఫారిన్‌ లేబర్‌’’గా ఈ లక్ష డాలర్ల ఫీజును విధించింది. అయితే ఈ ఫీజు దేశం బయటి నుంచి దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుంది. అమెరికాలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులు (ఎఫ్‌–1 ఆప్ట్‌లు) మార్పు చేసుకునేటప్పుడు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

70 శాతం మంది అధిక ఫీజు..
భారీగా ఫీజు ఉన్నా 70 శాతం దరఖాస్తుదారులు దానిని చెల్లించారు. ఇది రెండు ముఖ్యమైన విషయాలను స్పష్టం చేస్తోంది. అమెరికా టెక్‌ ఇండస్ట్రీ ఇప్పటికీ భారత్‌తో సహా విదేశీ ప్రతిభపై ఎంతగా ఆధారపడి ఉంది అనేది.
అత్యుత్తమ నైపుణ్యం కలిగిన టాలెంట్‌ను పొందడానికి కంపెనీలు ఏ స్థాయిలో ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నాయి అనేది. భారత్‌ నుంచి వచ్చే హెచ్‌–1బీ దరఖాస్తులు ఎప్పటిలాగే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ రంగాల్లో భారతీయులు ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు.

ఈ ఫీజు పెంపు అమెరికా కార్మికులను రక్షించడంలో ఎంతవరకు సఫలమవుతుందో సందేహాలు ఉన్నాయి. ఒకవైపు కంపెనీలు భారీ మొత్తం చెల్లించి కూడా విదేశీ నిపుణులను తీసుకురావడం వల్ల పాలసీ ఉద్దేశం కొంతవరకు విఫలమైనట్లే. మరోవైపు, ఈ ఫీజు వల్ల చిన్న, మధ్యతరహా కంపెనీలు ఇబ్బంది పడవచ్చు. పెద్ద టెక్‌ జైంట్స్‌ మాత్రం ఈ ఖర్చును సులభంగా భరించగలవు. ఇది దీర్ఘకాలికంగా అమెరికా ఇన్నోవేషన్, టెక్నాలజీ రంగంపై ప్రభావం చూపవచ్చు. ప్రపంచ స్థాయి ప్రతిభ అమెరికాకు రాకుండా అడ్డుకుంటే, ఆ దేశం టెక్‌ ఆధిపత్యం క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper