Homeఅంతర్జాతీయంTrump impact on America: అమెరికా కొంపమొచ్చింది ట్రంపే .. ఇదిగో సాక్ష్యం

Trump impact on America: అమెరికా కొంపమొచ్చింది ట్రంపే .. ఇదిగో సాక్ష్యం

Trump impact on America: అమెరికా ఇరాన్‌ యుద్ధం ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది. రెండు వారాల సీజ్‌ఫైర్‌ పూర్తయింది. కానీ పాకిస్తాన్‌ సూచనతో సీజ్‌ ఫైర్‌ కొనసాగిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే అమెరికా ఇరాన్‌ మధ్య వైరం ఇప్పటిది కాదు. 30 ఏళ్లుగా ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా ప్లాన్‌ వేస్తోంది. అందుకే ఇరాన్‌ కూడా 30 ఏళ్ల నుంచి అమెరికా ఎప్పుడు యుద్ధం ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అయితే ఈ యుద్ధం గురించి అమెరికా […]

Trump impact on America: అమెరికా ఇరాన్‌ యుద్ధం ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది. రెండు వారాల సీజ్‌ఫైర్‌ పూర్తయింది. కానీ పాకిస్తాన్‌ సూచనతో సీజ్‌ ఫైర్‌ కొనసాగిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే అమెరికా ఇరాన్‌ మధ్య వైరం ఇప్పటిది కాదు. 30 ఏళ్లుగా ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా ప్లాన్‌ వేస్తోంది. అందుకే ఇరాన్‌ కూడా 30 ఏళ్ల నుంచి అమెరికా ఎప్పుడు యుద్ధం ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అయితే ఈ యుద్ధం గురించి అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి జాన్‌ కెర్రీ సంచలన విషయాలు వెల్లడించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఇరాన్‌పై యుద్ధానికి ఒబామా, బుష్, బైడెన్‌ అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఇరాన్‌పై సైనిక చర్యలకు ఒత్తిడి తెచ్చారు. కానీ వారు తిరస్కరించారు. ట్రంప్‌ మాత్రమే ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, యుద్ధం మొదలు పెట్టినట్లు వెల్లడించారు. ఇరాన్‌ నాయకులను లక్ష్యంగా చేసి పాలనా మార్పు, సైనిక ధ్వంసం లక్ష్యాలను నెతన్యాహు ప్రణాళికగా పేర్కొన్నారు.

యుద్ధ ముగింపు సంకేతాలు
ఇదిలా ఉంటే ట్రంప్‌ ఇరాన్‌తో ఘర్షణ ముగుస్తుందని, ఇరాన్‌ బలహీనపడిందని ప్రకటించారు. మరోవైపు ‘నేనే ఇజ్రాయెల్‌పై ఒత్తిడి చేసి ఉండవచ్చు‘ అని ప్రత్యర్థి వాదనలను తిప్పికొట్టారు. రెండో విడత అణు చర్చలు, పాలన మార్పు సూచనలు ట్రంప్‌ వ్యూహాన్ని తెలియజేస్తున్నాయి. కానీ కెర్రీ దీన్ని ’అతిగా ఉద్ధృత’ చర్యలుగా విమర్శించారు.

యుద్ధ పరిణామాలు..
ఇరాన్‌ యుద్ధం మూడు వారాల్లోనే అమెరికాకు 1.4 నుంచి 2.9 బిలియన్‌ డాలర్ల నష్టం జరిగింది. ఫైటర్‌ జెట్లు, డ్రోన్లు, ట్యాంకర్లు నాశనం అయ్యాయి. పెంటగాన్‌ 200 బిలియన్‌ అదనపు బడ్జెట్‌ డిమాండ్‌ చేసింది. హర్మూజ్‌ జలసంధి మూసివేసి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. గత నెలలో 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇరాన్‌–లెబనాన్‌ పౌరులు ఎక్కువ. భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలు కూడా యుద్దంతో ప్రభావితం అవుతున్నాయి.

కెర్రీ ఇరాక్, వియత్నాం యుద్ధాల నష్టాలను ఉదాహరణగా చూపి, ఇరాన్‌పై ప్రమాదాన్ని హెచ్చరించారు. లక్షలాది పౌర మరణాలు, నిరాశ్రయులు, శరణార్థి సంక్షోభం ప్రమాదం. ఇజ్రాయెల్‌–ఇరాన్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనలు, గగనతల ఆందోళనలు ప్రపంచ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper