Bigg Boss 10 Telugu: రోజురోజుకి ‘బిగ్ బాస్ 10’ త్రిగున్ గ్రాఫ్ పెరుగుతూ వెళ్తోంది. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా త్రిగున్ మేనియా నే కనిపిస్తోంది. ఇతను బిగ్ బాస్ హౌస్ లో చేసే ఏ పని అయినా బాగా వైరల్ అయిపోతున్నాయి. తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు , అదే సమయం టాస్కులు బాగా ఆడుతున్నాడు , బ్రెయిన్ గేమ్స్ కూడా అదరగొడుతున్నాడు, ఇలా చెప్పుకుంటూ పోతే ‘బిగ్ బాస్ 10’ అంటే త్రిగున్, త్రిగున్ అంటే ‘బిగ్ బాస్ 10’ లాగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. కానీ ఇప్పటికీ రోహిత్ నే ఓటింగ్ లో మొదటి స్థానం లో ఉన్నాడు. ఆయనకు దరిదాపుల్లో త్రిగున్ లేడు, కానీ రోహిత్ షాలిని తో అదే లవ్ ట్రాక్ ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తే ఇక త్రిగున్ టైటిల్ విన్నర్ గా నిల్చిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే రీసెంట్ గానే త్రిగున్ తన తోటి కంటెస్టెంట్ అపూర్వ ని ర్యాగింగ్ చేస్తూ ‘పని దొంగ’ అనే పాట పాడుతాడు. దాన్ని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ డిజే రీమిక్స్ చేసి అప్లోడ్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇలా బిగ్ బాస్ హౌస్ లో త్రిగున్ చేసే ప్రతీ పని క్రేజీ గా ఉండడం తో అతని గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతూ వెళుతోంది. పైగా ఈ వారం ‘రోడ్ టు రీలోడ్’ టాస్కుల్లో గెలిచి , అందరికంటే అత్యధిక పాయింట్స్ ని సంపాదించి ఇమ్మ్యూనిటీ సాధించాడు. ఇతనితో పాటు ఆడినటువంటి అమన్ కి కూడా ఇమ్మ్యూనిటీ దక్కింది. ఇలా ఏ యాంగిల్ లో చూసిన త్రిగున్ లో విన్నర్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. రోహిత్ ఫ్యాన్స్ లో ఒక సెక్షన్ కూడా ఇప్పుడు నెమ్మదిగా త్రిగున్ ని సపోర్టు చేయడం మొదలు పెట్టారు.
త్రిగున్ కి మిగిలిన కంటెస్టెంట్స్ కి తేడా ఏమిటంటే , త్రిగున్ తన గేమ్ కోసం ఎవరినైనా వాడుకుంటాడు , ఎవరినైనా వెన్నుపోటు పొడిచేసి ముందుకెళ్తాడు , గొడవలు క్రియేట్ చేస్తాడు, అంతే కాకుండా రోహిత్ , ముకేశ్ లాగా పులిహోర ట్రాకులు పెట్టుకోడు, గట్టిగా చెప్పాలంటే స్నేహం కూడా పెద్దగా ఎవరితో చేయడు , అందరితోనూ బాగానే ఉంటాడు కానీ , మోసం చెయ్యాల్సి వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించడు, తను వచ్చింది కప్పు కోసం, ఆ కప్పుని గెలుచుకోవడం పైనే ద్రుష్టి పెట్టాడు. సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో లో త్రిగున్ వర్షిణి తో మాట్లాడుతూ రోహిత్ టీం లో తన వైపు నుండి షాలిని ని స్పై గా పెట్టాను అనే అర్థం వచ్చేలా చెప్తాడు. ఇప్పుడు షాలిని రోహిత్ తో లవ్ ట్రాక్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం త్రిగున్ వేసిన వ్యూహమేనా అనే సందేహం అందరిలోనూ ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.