Largest industrial city in China
China : చైనా పంపంచంలో అన్నిరంగాల్లో అగ్రస్థానం కోసం పోటీ పడుతోంది. ఒకవైపు భారీగా జనాభా ఉన్నా.. వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే అనేక నిర్మాణాలు, ఆవిష్కరణలు చేస్తోంది. ఈ క్రమంలో లో 32 వేల ఎకరాల్లో ఒక భారీ పరిశ్రమ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీ దిగ్గజం బీవైడీ (BYD) సంస్థ చేపట్టిన ఒక మెగా ఫ్యాక్టరీ ప్రాజెక్ట్‌ను సూచిస్తుంది. ఈ పరిశ్రమ హెనాన్ ప్రావిన్స్(Henan Pravinse)లోని జెంగ్‌ఝౌలో నిర్మితమవుతోంది. ఈ ప్రాజెక్ట్ ఎనిమిది దశల్లో పూర్తి చేయాలని బీవైడీ ప్రణాళిక వేసింది, మరియు దీని విస్తీర్ణం దాదాపు 32 వేల ఎకరాలుగా అంచనా వేయబడింది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఒక నగరాన్ని తలపించేలా ఉందని, దీనిలో భవనాలు, రోడ్లు, ఫుట్‌బాల్ మైదానాలు, టెన్నిస్ కోర్టులు వంటివి ఉన్నాయని సమాచారం.
Also Read : యుద్ధానికైనా సిద్ధమే.. ట్రంప్ బెదిరింపులపై స్పందించిన చైనా.. ట్రేడ్ వార్.. రియల్ వార్ అవుతుందా?
ఉత్పత్తి పెంపే లక్ష్యంగా..
ఈ మెగా ఫ్యాక్టరీ బీవైడీ సంస్థ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచే లక్ష్యంతో నిర్మితమవుతోంది. చైనా ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ముందంజలో ఉంది. బీవైడీ ఈ రంగంలో అగ్రగామిగా ఉంది. ఈ ఫ్యాక్టరీలో దాదాపు 60 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరిలో చాలామంది అక్కడే నివసిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, దాని పరిమాణం అమెరికాలోని ఒక నగరం కంటే పెద్దదిగా ఉంటుందని అంచనా.
సోషల్ మీడియాలో వైర్..
ఇక ఈ బీవైడీ పరిశ్రమ నిర్మాణానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతున్నాయి. డ్రోన్(Drone)వీడియోలు ఈ నిర్మాణం యొక్క విశాలతను చూపిస్తున్నాయి. బీవైడీ సంస్థలో ప్రస్తుతం 9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, రాబోయే నెలల్లో మరో 2 లక్షల మందిని నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ ఫ్యాక్టరీ చైనా యొక్క ‘మేడ్ ఇన్ చైనా 2025‘ వ్యూహంలో భాగంగా, తక్కువ ఖర్చుతో హైటెక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టే పారిశ్రామిక విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పరిశ్రమ చైనా ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక భాగంగా మారనుంది, ఉద్యోగాల సృష్టితోపాటు ప్రపంచ EV మార్కెట్‌లో చైనా ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తుంది.
Also Read : సరిహద్దు వివాదంలో కొత్త మలుపు.. లద్దాఖ్‌లో చైనా కౌంటీలు.. భారత్ ఆగ్రహం!
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: China the largest industrial city in china like khansar in the movie salar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com