China: గ్రేట్ అమెరికా మేక్ ఎగైన్ నినాదంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. ఇప్పుడు దేశాన్ని ఆ దిశగా మార్చేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఖర్చుల తగ్గింపుపై దృష్టి పెట్టారు. మరోవైపు వివిధ దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను పెంచుతున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై సుంకాల(Tariff)ను 25 శాతం పెంచారు. మార్చి 4వ తేదీ నుంచి సుంకాల పెంపు అమలులోకి వచ్చింది. అయితే దీనిపై స్పందించిన చైనా డబ్ల్యూటీసీ(WTC)లో పిటిషన్ వేస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఆదిశగా అడుగు వేయలేదు. దీంతో ట్రంప్.. మొదట సుంక 10 శాతం పెంచుతామని తెలిపారు. ఇప్పుడు దానిని రెట్టింపు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా(America)లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. ఈమేరకు ఎక్స్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా చైనాతో సమానంగా సంప్రదింపులు జరపాలని రాయబార కార్యాలయం నొక్కి చెప్పింది. ‘‘ఫెంటానిల్ సమస్యను అమెరికా నిజంగా పరిష్కరించుకోవాలనుకుంటే, ఒకరినొకరు సమానంగా చూసుకోవడం ద్వారా చైనాతో సంప్రదించడమే సరైన పని అని పేర్కొంది. అమెరికా యుద్ధాన్ని కోరుకుంటే, అది సుంకాల యుద్ధం అయినా, వాణిజ్య యుద్ధం అయినా లేదా మరేరకమైన యుద్ధం(war) అయినా పోరాడటానికి సిద్ధమే’ అని పోస్టులు స్పష్టం చేసింది. చైనా దిగుమతులపై సుంకాల పెంపునకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫెంటానిల్ సమస్యను తోసిపుచ్చింది. తన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి చైనా తీసుకున్న చర్యలు చట్టబద్ధమైనవి, అవసరమైనవని మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.
Also Read: నాగబాబు ఎమ్మెల్సీ.. కూటమి ఎట్టకేలకు ఫిక్స్!
అమెరికాకు సహకరిస్తాం..
అమెరికన్ ప్రజల సద్భావన దృక్పథంతో ఫెంటానిల్ సమస్యను పరిష్కరించడానికి అమెరికాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది. కానీ, అమెరికా చైనాపై నిందలు మోపడానికి యత్నిస్తోందని ఆరోపించింది. సుంకాల పెంపుతో చైనాపై ఒత్తిడి, బ్లాక్‌మెయిల్(Blkackmail)చేయడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. వారు తమకు సహాయం చేసినందుకు మమ్మల్ని శిక్షిస్తున్నారు. ఇది అమెరికా సమస్యను పరిష్కరించదని స్పష్టం చేసింది.
రియల్ వార్‌గా మారుతుందా..
అమెరికా, చైనా మధ్య మొదలైన ట్రేడ్ వార్.. రియల్ వార్‌కు దారి తీస్తుందా అన్న చర్చ జరుగుతోంది. అమెరికా చర్యలకు దీటుగా చైనా స్పందించడం చూస్తుంటే ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగా చైనా ఉంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ వార్(Trade War) ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అమెరికా వ్యతిరేక దేశాలను ఏకం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
సుంకాలు అమలులోకి..
ట్రంప్ పరిపాలన చైనా వస్తువులపై అదనంగా 10 శాతం సుంకాన్ని విధించింది, ఇప్పటికే అమలులో ఉన్న 10 శాతానికి జోడించబడింది. ఈ సుంకాలు మంగళవారం నుండి అమల్లోకి వచ్చాయి. ఇదే అంశంపై కెనడా(Canada), మెక్సికో(Mexico) నుంచి దిగుమతులపై కూడా ఇలాంటి సుంకాలు వర్తింపజేయబడ్డాయి. ఈ చర్యలు వాణిజ్య ఉద్రిక్తతలను పెంచాయి, ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి మరియు ఇప్పటికే దీర్ఘకాలిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న అమెరికన్లకు ఖర్చులను పెంచుతాయి. ఫెంటానిల్, దాని పూర్వగామి రసాయనాల ప్రవాహాన్ని అరికట్టడానికి అగ్ర మూడు యూఎస్(US) వాణిజ్య భాగస్వాములు తగినంతగా చేయలేదని ట్రంప్ ఆరోపించిన తర్వాత, వార్షిక వాణిజ్యంలో దాదాపు 2.2 ట్రిలియన్లకు అంతరాయం కలిగించే సుంకాలు ప్రవేశపెట్టబడ్డాయి.
ఏప్రిల్ 2 నుంచి మరిన్ని సుంకాలు..
ఇక తన ఆరువారాల పాలనపై కాంగ్రెస్ ముందు మాట్లాడిన ట్రంప్, ఏప్రిల్ 2న మరిన్ని సుంకాలను అమలు చేస్తామని ప్రకటించారు, వాటిలో ‘పరస్పర సుంకాలు‘ మరియు దీర్ఘకాలిక వాణిజ్య అసమతుల్యతలను పరిష్కరించడానికి ఉద్దేశించిన ఇతర నాన్–టారిఫ్ చర్యలు ఉన్నాయి. ‘ఇతర దేశాలు దశాబ్దాలుగా మనపై సుంకాలను ఉపయోగిస్తున్నాయి, ఇప్పుడు మన వంతు వచ్చింది‘ అని ట్రంప్ అన్నారు, భారతదేశం, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్, చైనా, ఇతర దేశాలు అమెరికా వస్తువులపై విధించిన అధిక సుంకాలను ప్రస్తావించారు.
Also Read: గవర్నర్ గా విజయసాయిరెడ్డి.. నిజం ఎంత?