Homeఅంతర్జాతీయంCar-plane collision: కారు–విమానం ఢీ.. వీడియో వైరల్‌

Car-plane collision: కారు–విమానం ఢీ.. వీడియో వైరల్‌

Car-plane collision: శీర్షిక చదవగానే కారు.. విమానం ఢీకొనడం ఏంటి అనుకుంటున్నారా.. కారు నడిచేది రోడ్డుపైన.. విమానం ఎగిరేది గాల్లో.. ఈ రెండు ఎలా ఢీకొటాయి అని ఆలోచిస్తున్నారా.. శీర్షిక తప్పు అనుకుంటున్నారా.. తొందర పడకండి మీరు చదివింది. నిజమే.. ప్రమాదం జరిగింది నిజమే.. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని బ్రెవర్డ్‌ కౌంటీలో ఇంటర్‌స్టేట్‌–95 హైవేపై సోమవారం రాత్రి ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారును విమానం బలంగా ఢీకొట్టింది. […]

Car-plane collision: శీర్షిక చదవగానే కారు.. విమానం ఢీకొనడం ఏంటి అనుకుంటున్నారా.. కారు నడిచేది రోడ్డుపైన.. విమానం ఎగిరేది గాల్లో.. ఈ రెండు ఎలా ఢీకొటాయి అని ఆలోచిస్తున్నారా.. శీర్షిక తప్పు అనుకుంటున్నారా.. తొందర పడకండి మీరు చదివింది. నిజమే.. ప్రమాదం జరిగింది నిజమే..

అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని బ్రెవర్డ్‌ కౌంటీలో ఇంటర్‌స్టేట్‌–95 హైవేపై సోమవారం రాత్రి ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారును విమానం బలంగా ఢీకొట్టింది. ఏకంగా విమానం కారుపైనే ల్యాండ్‌ అయినట్లుగా వాలిపోయింది. ఈ అసాధారణ ప్రమాదంలో చిన్న విమానం నేలపై పడి, ఎదురుగా వస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన స్థానికుల్లో భయాన్ని కలిగించింది. విమానం వేగాన్ని నియంత్రించలేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కారులో మహిళకు స్వల్ప గాయాలు..
వీడియోలో ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే.. కారులో ఒక్కరు కూడా బతికి ఉండే అవకాశం లేదు అనిపిస్తుంది. కానీ విమానం కారుపై పడి.. కిందకు జారిపోయింది. ప్రమాదం తర్వాత కూడా కారు.. రోడ్డుపై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మరోవైపు విమానం కూడా రోడ్డుపై జారుకుంటూ వెళ్లి ముందు ఉన్న మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంతో కారులో ప్రయాణిస్తున్న మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణాపాయం లేదు. విమానంలో పైలట్, ఒక ప్రయాణికుడు ఉన్నారు. వారు కూడా క్షేమంగా బయట పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక, పొలీస్‌ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు తీసుకున్నారు.

విమానం ఎందుకు రహదారిపై పడిపోయింది, టెక్నికల్‌ లోపం లేదా వాతావరణ సమస్యలా ఏమైనా కారణాలు ఉన్నాయా అని అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ రకమైన అరుదైన ప్రమాదాలు రహదారి భద్రతను పెంచేందుకు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper