Thiruparankundram Issue: తిరుపరంకుండ్రం.. రోజురోజుకు చిలికిచిలికి గాలివానగా మారింది. తమిళనాడులో మతం పెద్దగా ప్రాధాన్యత సంతరించుకోదు. డీఎంకే దేవుళ్లను విమర్శిస్తుంటుంది. పెరియార్ నే దేవుడిగా కొలుస్తారు. ఎన్నికల్లో ప్రధాన అంశంగా పెరియర్ ను తీసుకురాదు. ఎందుకంటే ఓట్లు పడవని భయం.
ఈ ఎన్నికల్లో మతం ప్రధాన అంశంగా మారబోతుందా? అంటే ఔననే అనిపిస్తోంది. మతం తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు. సంవత్సరం క్రితం మురుగన్ భక్తుల సమావేశం మధురైలో జరిగినప్పుడే హిందుత్వం మొదలైంది. తాజాగా ధ్వజస్తంభంపై దీపం వెలిగించేందుకు ప్రభుత్వం ఒప్పుకోక హైకోర్టు ఆదేశాలు పాటించక హిందుత్వవాదుల ఆగ్రహానికి కారణమైంది. దర్గా ఉందని దీపం వెలిగించకనీయపోవడంతో ఈ వివాదం మొదలైంది.
కార్తీక దీపం వెలిగించడం తమిళనాడులో అతిపెద్ద పండుగ. భక్తులు ఎంతో భక్తితో దీన్ని నిర్వహిస్తారు. అరుణాచలంలో కూడా దీపోత్సవం బాగా నిర్వహిస్తారు. తిరుపరంకుండ్రంలోనూ జ్యోతి వెలిగించడానికి హైకోర్టు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయకపోవడంతో హిందుత్వవాదుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
ఎన్నికల ముందు మురుగన్ భక్తులతో వివాదం డీఎంకే చేస్తున్న అతిపెద్ద తప్పిదం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.