spot_img
Homeఅంతర్జాతీయంBangladesh Air Force Purge: వైమానిక దళంలో పాక్‌ అనుకూలుల ఏరివేత.. బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం!

Bangladesh Air Force Purge: వైమానిక దళంలో పాక్‌ అనుకూలుల ఏరివేత.. బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం!

Bangladesh Air Force Purge: బంగ్లాదేశ్‌ వైమానిక దళంలో ఇటీవల చేపట్టిన ప్రక్షాళన చేపట్టింది. మహ్మద్‌ యూనస్‌ పాలనలో వైమానికదళాన్ని మొత్తం భ్రష్టుపట్టించాడు. పాకిస్తాన్‌ అనుకూలులకు పదవులు కట్టబెట్టారు. ఐఎస్‌ఐ జోక్యం పెరిగింది. భారత సరిహద్దులో ఉన్న ఎయిర్‌ బేస్‌లు, రాడార్‌ కేంద్రాల నుంచి భారత సమాచారం, కదలికల వివరాలను పాకిస్తాన్‌కు పంపేలా ఏర్పాట్లు చేసుకుంది. తాజాగా చేపట్టిన ప్రక్షాళనతో ఆ దేశ భద్రతతో పాటు, పొరుగు దేశమైన భారత్‌కు కూడా వ్యూహాత్మకంగా ఎంతో కీలకం.

ఎయిర్‌ ఫోర్స్‌లో కీలక పరిణామాలు
బంగ్లాదేశ్‌ తన వైమానిక దళంలో అంతర్గత భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఏప్రిల్‌ 20 నుంచి భారీ ప్రక్షాళనను ప్రారంభించింది. ఈ చర్యలో భాగంగా స్క్వాడ్రన్‌ లీడర్‌ స్థాయి అధికారుల నుంచి ఎయిర్‌ క్రాఫ్ట్‌ మెన్‌ వరకు అనేకమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సిబ్బంది తమ మొబైల్‌ ఫోన్లను అధికారులకు అప్పగించాలని, ఎటువంటి సమాచారాన్ని తొలగించకూడదని కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి.

పెరిగిన ఐఎస్‌ఐ ప్రభావం..
బంగ్లాదేశ్‌ రక్షణ వ్యవస్థలో పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ప్రభావం పెరగడం భారత్‌కు ప్రధాన ఆందోళనగా మారింది. రాడార్‌ స్టేషన్లు, ఎయిర్‌ బేస్‌లలోని కొందరు కీలక అధికారులు పాకిస్తాన్‌ అనుకూల ధోరణిని ప్రదర్శిస్తూ, వ్యూహాత్మక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా భారత్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోని రాడార్‌ కేంద్రాల ద్వారా భారత వైమానిక దళం యొక్క కదలికలను గమనించి, ఆ వివరాలను పాకిస్తాన్‌కు పంపడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లిందని విశ్లేషణలు చెబుతున్నాయి.

దౌత్యపరమైన సంబంధాలు..
ఈ ప్రక్షాళన వెనుక ఇరు దేశాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చలు కీలక పాత్ర పోషించాయి. ఏప్రిల్‌ 2026 ప్రారంభంలో బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఖలీల్‌ ఉర్‌ రహమాన్‌ భారత పర్యటనలో భాగంగా, ఇరు దేశాల మధ్య కరెన్సీ స్వాప్‌ ఒప్పందం, ఆర్థిక సహకారంపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో భారత్‌ తన సరిహద్దు భద్రతకు సంబంధించిన ఆందోళనలను వ్యక్తం చేయగా, బంగ్లాదేశ్‌ ప్రభుత్వం స్పందిస్తూ వైమానిక దళంలో చొరబాట్లను అరికట్టేందుకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రక్షాళన మొదలు పెట్టింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ వకార్‌ జమాన్‌ వంటి భారత్‌ అనుకూల వ్యక్తులు వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్‌కు, భారత్‌ అందిస్తున్న సహకారం రానున్న కాలంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత దృఢం కానుంది. మాల్దీవులు కూడా ఇటీవలే కరెన్సీ స్వాప్‌ చేసుకుంది. దీంతో ఇరు దేశాలకు లాభం జరుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper