
సీనియర్ హీరోయిన్ ‘కాజల్ అగర్వాల్’ పెళ్లి అయినా, భర్తను దూరం పెట్టి మరీ వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. పెళ్లి అయి సంవత్సరం కూడా కాకుండానే ఎందుకు ఇంత బిజీ అవుతున్నావ్ అని ఆమె భర్త అసంతృప్తి వ్యక్తపరుస్తున్నాడట. అయినా కాజల్ కి సినిమాలు, రెమ్యునరేషన్స్ తప్ప.. సంసారం, కుటుంబం పట్టడం లేదట. అందుకే, రిస్క్ షాట్స్ చేయాల్సిన సినిమాలను కూడా కాజల్ రెమ్యునరేషన్ కోసం ఒప్పేసుకుంటుంది.
ఇంతకీ కాజల్ మార్షల్స్ ఆర్ట్స్ చేస్తే ఎలా ఉంటుంది..? చేతిలో మెషీన్ గన్ పట్టుకొని విలన్లను కాలుస్తుంటే ఎలా ఉంటుంది ? అని చూడటానికి నెటిజన్లు ఆసక్తిగా ఉన్నారు.
అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. మొత్తం బంద్ కావడంతో ఇప్పుడు కాజల్ కు కావాల్సినంత టైం దొరికింది. అందుకే సాయం సంధ్య వేళలో భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.
మలి సంధ్యలో కాజల్ తాజాగా ఒక ఫొటో తీసుకొని షేర్ చేసింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాజల్ కు కావాల్సినంత టైం దొరికిందని తన భర్తతో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
https://www.instagram.com/p/CPM7NJlHdBc/?utm_source=ig_web_copy_link