HomeజాతీయంITT Madras BharOS: గూగుల్, ఐఫోన్ల‌కు భార‌త్ చెక్.. మోడీ పెద్ద ప్లాన్

ITT Madras BharOS: గూగుల్, ఐఫోన్ల‌కు భార‌త్ చెక్.. మోడీ పెద్ద ప్లాన్

ITT Madras BharOS: ఇండియా ఆత్మనిర్భ‌ర భార‌త్ దిశ‌గా అడుగులేస్తోంది. ద్విముఖ పోటీ ఉన్న ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ త‌యారీలోకి అడుగుపెడుతోంది. భారతీయుల‌కు స్వ‌దేశీ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ తీసుకురాబోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆపిల్, గూగుల్ దే అగ్ర‌స్థానం. ఇక నుంచి భార‌త్ కూడ పోటీ ప‌డ‌బోతోంది.

ITT Madras BharOS
ITT Madras BharOS

ఆపిల్ ఐవోఎస్, గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచం వాడుతున్న ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్. ఈ రెండు కంపెనీలు ఓఎస్ మార్కెట్ లో తిరుగులేని శ‌క్తిని సంపాదించుకున్నాయి. మిగిలిన కంపెనీల ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్ ఉన్న‌ప్ప‌టికీ.. మార్కెట్లో వాటి షేర్ చాలా త‌క్కువ‌. భార‌త్ లాంటి దేశాల్లో వంద‌ల కోట్ల ఫోన్లు ఉప‌యోగిస్తున్నారు. వాటిల్లో ఆపిల్, గూగుల్ ఓఎస్ వాడుతున్నారు. ఇలా విదేశీ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్ వాడ‌టం వ‌ల్ల డేటా భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంది. గ‌తంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు అర‌కొర చోటుచేసుకున్నాయి. భార‌త ప్ర‌భుత్వం వాటి పై చ‌ర్య‌లు తీసుకుంది.

డేటా భ‌ద్ర‌త భార‌త ప్ర‌భుత్వ ప్ర‌థ‌మ ల‌క్ష్యం. ఇందులో భాగంగా ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ త‌యారీని భార‌త ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంది. ఐఐటీ మ‌ద్రాస్ ఆధ్వ‌ర్యంలో జాన్ డీకే అనే కంపెనీ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ను రూపొందించింది. దీనికి సంబంధించి 2022 మార్చిలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబ‌రం అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ చెప్పారు. భార‌త్ సొంతంగా ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ త‌యారు చేస్తోంద‌ని అన్నారు. అయితే సాఫ్ట్వేర్ ఎగుమ‌తి, వెలుప‌ల వినియోగం పై నిషేధం విధించ‌లేద‌ని తెలిపారు. ఈ ఓఎస్ పూర్తిగా భార‌త ప్ర‌భుత్వానికి చెందిన‌ది. ఇది అందుబాటులోకి వ‌స్తే భార‌తీయులు సొంత ఓఎస్ వినియోగించ‌వచ్చు.

ITT Madras BharOS
ITT Madras BharOS

సొంత ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ వాడ‌టం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. డేటా భ‌ద్ర‌త‌కు ఎలాంటి ముప్పు ఉండ‌దు. అదే స‌మ‌యంలో అన‌వ‌స‌ర‌మైన యాప్స్ బ‌ల‌వంతంగా వాడాల్సిన అవ‌స‌రం లేదు. అవ‌స‌ర‌మైన యాప్స్ మాత్రమే వాడ‌వ‌చ్చు. స్వ‌దేశీ ఓఎస్ అందుబాటులోకి వ‌స్తే గూగుల్, ఐఫోన్ ఏక‌ఛ‌త్రాధిప‌త్యానికి గండిప‌డనుంది. ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ ల‌క్ష్యం నెర‌వేర‌నుంది.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper