Grey Hair: మనకు ఆరోగ్య పరిరక్షణలో ఎన్నో చర్యలు తీసుకుంటాం. ఇందులో అన్ని భాగాలు సమానమే. దీంతో మనకు తల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలు సక్రమంగా ఉండాల్సిందే. లేకపోతే ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుంది. తల సంరక్షణలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. కృత్రిమ షాంపూలు, సబ్బులు కాకుండా ప్రకృతి సిద్ధంగా తయారు చేసే వాటిని తీసుకుంటే ఫలితం కచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తలను సంరక్షించుకునేందుకు తలను కుంకుడుకాయ రసంతో స్నానం చేయడం ఉత్తమం.

తల స్నానం తరువాత ఇతర నూనెలు వాడకూడదు. తలలో తడి ఉండకుండా చూసుకోవాలి. తలను ఆరబెట్టుకుని శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. దీంతో తల దురదగా మారుతుంది. దురద పెట్టినప్పుడు ఇష్టారాజ్యంగా కాకుండా చూసుకోవాలి. తలకు రక్తప్రసరణ సరిగా ఉండేలా ప్రయత్నించడం మంచిది. కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. ప్రకృతి పరంగా దొరికే నూనెలను వాడుకోవాలి. జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే కూడా కొన్ని అలవాట్లు మార్చుకోవాలి.
జుట్లు తెల్లబడకుండా ఉండటానికి కూడా పలు చిట్కాలు పాటించాలి. రాత్రి పూట నిద్ర బాగా పోయేలా చూసుకోవాలి. గుంటగలగర ఆకు, కరివేపాకు, వేప ఆకు మూడింటిని దంచి మరగబెట్టి తలకు పట్టిస్తే మంచిది. కలబంద గుజ్జు, జామ ఆకులు కలిపి పేస్టుగా చేసి నువ్వుల నూనెలోఉడికించి తలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. ఇలా జుట్టు తెల్లబడకుండా చూసుకోవచ్చు. చుండ్రు లేకుండా చూసుకోవడం ఉత్తమం. చుండ్రును తగ్గించుకోవడానికి నేల ఉసిరిని రసం, నిమ్మరసం తలకు పట్టిస్తే మేలు కలుగుతుంది.

ప్రతి రోజు ఎండలో కొద్దిసేసేపు ఉంటే ఫలితం ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు వెంట్రుకలకు ఎంతో లాభం కలుగుతుంది. దీంతో ఐరన్ సమృద్ధిగా లభించి జుట్టుకు నష్టం కలగకుండా చేస్తాయి. ఇలా మన జుట్టు సంరక్షనలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని మంచి వెంట్రుకలు ఉండేలా చూసుకోవచ్చు. ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలు ఉంటాయి. వాటిని పాటిస్తే కూడా మనకు ఎన్నో విధాలుగా మేలు కలుగుతుంది.