Assault On Dog: మనుషుల్లో జంతు సంస్కృతి పెరిగిపోతోంది. శృంగారం విషయంలో ఎన్నో నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా లైంగిక దాడులు చేస్తూ మనిషిలో కూడా రాక్షసుడు ఉన్నాడని నిరూపించుకుంటున్నారు. జంతువులను తమ బిడ్డల్లా చూసుకోవాల్సిన వారే వాటిపై లైంగిక దాడులకు తెగబడుతూ పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇదివరకు నమోదైన కేసులే కావడం గమనార్హం. ఆవులు, కుక్కలపై నిత్యం లైంగిక దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గతంలో నిర్మల్ జిల్లాలో ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారం చేసిన ఘటన తెలిసిందే. ఇప్పుడు ఓ ప్రబుద్దుడు కుక్కపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కల్యాణ్ ఈస్ట్ హనుమాన్ నగర్ కు చెందిన సాగర్ అనే వ్యక్తి కుక్కలను సాకుతున్నాడు. దీంతో వాటితో అతడికి అవినాభావ సంబంధం ఏర్పడింది. రెండేళ్లుగా అతడు కుక్కపై అసహజ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీంతో ఈ విషయం కాస్త అక్కడి కుర్రాళ్లకు తెలియడంతో వారు రహస్యంగా వీడియో తీశారు. అది కాస్త వైరల్ అయింది. సామాజిక మాధ్యమాల్లో ప్రసారం కావడంతో అతడి భాగోతం బయట పడింది. దీంతో అతడు చల్లగా జారుకున్నాడు.
Also Read: Jagan- Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక విషయంలో జగన్ ఆ చాన్స్ మిస్సయ్యారా?
ఒంటరిగా ఉంటున్న అతడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. జంతువులను ప్రేమగా చూసుకోవాల్సిన అతడు వాటిపై లైంగిక దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది. దీంతో విషయం కాస్త జంతు ప్రేమకుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు అతడిపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అతడిపై సెక్షన్ 377 ప్రకారం అసహజ శృంగారం, 1960 ఎనిమల్ క్రూయల్ యాక్ట్ ప్రకారం అతడిపై కేసులు నమోదు చేశారు. అతడు పరారీలో ఉండటంతో త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

జంతువులపై కూడా కోరిక తీర్చుకునే మనుషులు ఉండటం నిజంగా దురదృష్టమే. సాటి ప్రాణులపై ప్రేమ చూపించాల్సిన వాడే వాటిని లైంగికంగా వేధించడంతో అతడికి దాదాపు పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. ఇప్పటికైనా జంతువులను మంచి దృష్టితో చూసుకుంటూ వాటిని పెంచాల్సిన బాధ్యతను గుర్తుంచుకోవాలి. కానీ ఇలా అసహజంగా వాటిపైనే కామ దాహం తీర్చుకునే నయవంచకులు ఉన్నంత కాలం వాటికి మనుగడ ఎక్కడ ఉంటుందని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
Also Read:Tribal Marriage in Jharkhand: గిరిజనుల వింత ఆచారం.. అక్కడ అన్నీ అయిన తర్వాతే పెళ్లి