Jagan- Presidential Election: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి గా ద్రౌపది ముర్ము ను ప్రకటించి ప్రచారంలో దిగింది. దీనికి ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రకటించాయి. ఇక పోటీ అనివార్యమయ్యే అవకాశం ఉండటంతో ఎవరి ప్రచారం వారు చేసుకుంటున్నారు. ఈ మేరకు శుక్రవారం ద్రౌపది ముర్ము నామినేషన్ వేసి వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తోంది. దీంతో విపక్షాలు కూడా తమ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించేందుకు సిద్ధమవుతున్నాయి. విపక్షాలకు మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా పోటీ నెలకొనే అవకాశం ఏర్పడుతోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ప్రతిపక్షాలు కంగుతిన్నాయి. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమకు మద్దతు ఇవ్వాలని లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. కనీసం బీజేపీ నుంచి వాగ్దానాలు తీసుకోనైనా మద్దతు ఇస్తానని షరతు విధించకుండా ఏకపక్షంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం నిజంగా దురదృష్టమే అని చెబుతున్నారు.
Also Read: PM Modi- Gujarat Riot Case: ప్రతీకారం షురూ: మోడీకి క్లీన్ చిట్.. ఆయనపై పిటీషన్ వేసిన వాళ్లు జైలుకు..
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పక్షం అభ్యర్థిని గెలవనీయకుండా గట్టి పోటీ ఇవ్వడానికే ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగానే తమ అభ్యర్థిని ప్రకటించాయి. ఈ మేరకు ప్రచారం కూడా మొదలు పెట్టాయి. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి తమకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దేశానికి కాబోయే రాష్ట్రపతికి ప్రచారం నిర్వహించడం కామన్ అయిపోయింది. గతంలో ఒకే అభ్యర్థి పోటీలో ఉండటంతో ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉండేదికాదు

ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. అటు బీజేపీ, ఇటు ప్రతిపక్షం రెండు పక్షాలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపడంతో ఎన్నిక కోసం పోటీ ఏర్పడింది. దీంతో ఎవరు విజయం సాధిస్తారో అనే సందేహాలు వస్తున్నా అధికార పార్టీ కే విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ఏ రకమైన ప్రయోజనాలు సాధించకుండానే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం సంచలనంగా మారింది. దీంతో భవిష్యత్ లో కూడా వైసీపీకి ఏ రకమైన ప్రయోజనాలు దక్కడం లేదని తెలుస్తోంది. మొత్తానికి జగన్ తీసుకున్న నిర్ణయంతో పార్టీకి కాకుండా రాష్ట్రానికి కూడా ఏరకమైన లాభం జరగడం లేదనే చెబుతున్నారు.
[…] […]
[…] […]
[…] […]