Atmakur By Poll Results: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం తేలింది. అందరు ఊహించినట్లుగానే మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై దాదాపు 82 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. దీనిపై అందరు ముందస్తుగానే ఊహించారు. విక్రంరెడ్డి విజయం తథ్యమనే వాదన కూడా వచ్చింది. కానీ జాతీయ పార్టీ అయిన బీజేపీ పోటీలో నిలిచినా విక్రం రెడ్డి విజయాన్ని ఆపలేకపోయింది. దాదాపు ఏకపక్షంగా పోలింగ్ సాగినట్లు తెలుస్తోంది. ప్రతి రౌండ్ లోనూ విక్రం రెడ్డి మెజార్టీ కనబరచడం తెలిసిందే. పదిహేను రౌండ్లలో గౌతం రెడ్డి హవా కొనసాగింది.

గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థులే విజయం సాధించడం విశేషం. దీంతో ఏపీలో ఏ ఎన్నిక వచ్చినా అధికార పార్టీనే హస్తగతం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆత్మకూరు ఎన్నిక కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్లింది. మేకపాటి గౌతం రెడ్డి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా ఉండగానే ఆయన అకాల మరణం చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. చనిపోయిన వ్యక్తి కుటుంబానికే టికెట్ ఇవ్వడంతో మిగతా పార్టీలు సానుభూతి ప్రభావంతో పోటీకి దూరమైనా జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇక్కడ పోటీలో నిలిచింది. కానీ విజయం సాధించలేదు.
Also Read: Jagan- Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక విషయంలో జగన్ ఆ చాన్స్ మిస్సయ్యారా?
నియోజకవర్గంలో 2,13,338 ఓట్లు కాగా పోలైన ఓట్లు 1,37,081. ఇందులో విక్రంరెడ్డికి 1,02,074 ఓట్లు రావడంతో విక్రంరెడ్డి ఎన్నిక ఖరారైంది. దీంతో సమీప ప్రత్యర్థిపై విక్రంరెడ్డి విజయం సాధించినట్లు తేల్చారు. మొత్తానికి వైసీపీ అభ్యర్థి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై 82,742 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి విజయం ఖరారు కావడంతో
వారిలో హర్షం వ్యక్తమవుతోంది. మేం సాధించిన విజయాలే మాకు రక్షణగా నిలుస్తున్నాయని చెబుతున్నారు.

దీంతో రాష్ట్రంలో వైసీపీ తిరుగులేదని తెలుస్తోంది. ఏ ఎన్నిక వచ్చినా దానిదే విజయం కావడంతో ఏపీలో వైసీపీనే ఎదురులేని శక్తిగా ఎదుగుతోందని కార్యకర్తలు చెబుతున్నారు. తాము చేపట్టే విధానాలే శ్రీరామరక్షగా మారుతున్నాయని తెలుస్తోంది. భవిష్యత్ లో కూడా ఇలాగే విజయం సాధించి రెండోసారి అధికారం చేపడతామని భరోసాతో ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలో వైసీపీ విజయం నల్లేరుపై నడకలా సాగుతోంది. ఏ ఉప ఎన్నిక వచ్చినా విజయం దక్కించుకుని ప్రత్యర్థి పార్టీకి సవాలు విసురుతోంది.
Also Read:Tribal Marriage in Jharkhand: గిరిజనుల వింత ఆచారం.. అక్కడ అన్నీ అయిన తర్వాతే పెళ్లి
[…] […]
[…] […]
[…] […]
[…] […]