spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Taraka Ratna- NTR: ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వస్తున్నారు... నందమూరి హీరో అధికారిక ప్రకటన 

Taraka Ratna- NTR: ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వస్తున్నారు… నందమూరి హీరో అధికారిక ప్రకటన 

Taraka Ratna- NTR: పొలిటికల్ ఫేమ్ కూడా ఉన్న స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. మాజీ సీఎం ఎన్టీఆర్ మనవడిగా ఆయన టీడీపీ అధినేత కావాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ పెద్ద ఎత్తున పొలిటికల్ క్యాంపైన్ చేశారు. తాతను గుర్తు చేసేలా ఖాకీ రంగు దుస్తుల్లో ప్రచార రథం పై నిల్చొని ఉత్తేజ పూరిత ప్రసంగాలు ఇచ్చారు. ఎన్టీఆర్ వాక్పటిమ చూసి ఈయన రాజకీయాల్లో కూడా రాణిస్తాడని భావించారు. అయితే 2009 ఎన్నికలో టీడీపీ ఓటమి పాలైంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు హరికృష్ణ కుటుంబానికి దూరం పెరిగింది.

Taraka Ratna- NTR
Taraka Ratna- NTR

టీడీపీకి ఎన్టీఆర్ పూర్తిగా దూరమయ్యారు. రాజకీయాల జోలికి పోకుండా కెరీర్ పై ఫోకస్ పెట్టారు. అదే సమయంలో ఎన్టీఆర్ వలన వారసత్వ ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు ఆయన్ని దూరం పెట్టారనే వాదన ఉంది. నారా లోకేష్ కి టీడీపీ అధినాయకత్వం దక్కాలంటే ఎన్టీఆర్ వంటి ప్రతిభ ఉన్న లీడర్ టీడీపీలోకి రాకపోవడమే మంచిదని బాబు నమ్ముతున్నాడని మెజారిటీ వర్గాల అభిప్రాయం.

ఈ క్రమంలో బాబు జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేయాలని చూస్తున్నాడు అంటారు. మరోవైపు టీడీపీ కేడర్ లో ఎన్టీఆర్ వర్గం అనేది ఒకటి తయారైంది. సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి కూడా ఎన్టీఆర్ వస్తేనే పార్టీ భవిష్యత్తు అన్నట్లు ఒకటి రెండు సందర్భాల్లో హింట్ ఇచ్చారు. 2019 ఓటమి తర్వాత బాబుకు ఎన్టీఆర్ సెగ ఎక్కువైంది. కష్టకాలంలో ఉన్న టీడీపీకి పూర్వ వైభవం ఎన్టీఆర్ తోనే వస్తుందని భావిస్తున్నారు కొందరు. టీడీపీ ఎన్టీఆర్, బాబు వర్గంగా చీలిపోయింది. భువనేశ్వరి పై వైసీపీ నాయకుల ఆరోపణలు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సంఘటనలపై ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదని టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఏకిపారేశారు.

అసలు ఎన్టీఆర్ నందమూరి వారసుడే కాదంటూ ధ్వజమెత్తారు. టీడీపీ కేడర్ లో ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ దెబ్బ తీసేందుకు బాబు వెనకుండి ఈ వ్యాఖ్యలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే టీడీపీలోని ఎన్టీఆర్ వర్గం, అభిమానులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఒక దశలో బాబు, ఎన్టీఆర్ వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా యుద్ధానికి దిగారు. బాబు బహిరంగ సభల్లో జై ఎన్టీఆర్ జెండాలు చూపుతూ ఫ్యాన్స్ నిరసనలు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయ ముఖచిత్రం ఇలా ఉండగా… తారక్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Taraka Ratna- NTR
Taraka Ratna- NTR

హీరోగా ఫేడ్ అవుట్ అయిన తారక్ పాలిటిక్స్ కి వెళుతున్నానంటూ వెల్లడించారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తాను అన్నారు. ఏపీని కాపాడాలంటే బాబు రావాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై పెదవి విప్పారు. తమ్ముడు ఎన్టీఆర్ కూడా ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు. టీడీపీ తరపున ప్రచారం చేస్తారు అన్నారు. టీడీపీ అధినేతపై అసహనంతో ఉన్న ఎన్టీఆర్ 2024 ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper