Homeఎంటర్టైన్మెంట్Waltair Veerayya: వాల్తేరు వీరయ్యకు థియేటర్స్... ఆ విషయం మాకొదిలేయండి!

Waltair Veerayya: వాల్తేరు వీరయ్యకు థియేటర్స్… ఆ విషయం మాకొదిలేయండి!

Waltair Veerayya: సంక్రాంతికి మా హీరో సినిమా వస్తుందన్న సంతోషం ఒకవైపు థియేటర్స్ పూర్తి స్థాయిలో దొరుకుతాయో లేదోనన్న ఆందోళన మరోవైపు మెగా ఫ్యాన్స్ లో కొనసాగుతుంది. ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వాముల్లో ఒకరైన రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు. థియేటర్స్ సమస్య మాకు వదిలేయండి. వీలైనన్ని థియేటర్స్ లో వాల్తేరు వీరయ్య సినిమాను విడుదల చేస్తాము. ఓపెనింగ్ డే గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా వాల్తేరు వీరయ్య ఒకటి రెండు ఆడే సినిమా కాదు. నెల రోజులు నిరవధికంగా ఆడే సినిమా. ఓపెనింగ్ డే ఎన్ని థియేటర్స్ లభించినా పర్లేదు. సినిమా లాంగ్ రన్ ఆడుతుంది కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Waltair Veerayya
chiranjeevi

బాస్(చిరంజీవి)ఆల్రెడీ సినిమా చూశారు. ఆయనకు అద్భుతంగా నచ్చేసింది. ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నామని చెప్పారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మంచి సినిమా నిర్మించారు. మనం భారీ విజయం సాధించబోతున్నామని చిరంజీవి గారు మాతో పంచుకున్నారు. సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య వీరవిహారం చేయనుందని రవిశంకర్ చెప్పకనే చెప్పారు. థియేటర్స్ దొరక్కుండా ఇబ్బంది పెట్టాలని చేస్తున్నవారికి కూడా పరోక్షంగా ఆయన చురకలు వేశారు.

ఓపెనింగ్ డే దొరికినన్ని థియేటర్స్ లో విడుదల చేస్తాం. థియేటర్స్ పెద్ద మొత్తంలో లభించకపోయినా మాకు ఇబ్బంది లేదు. మా సినిమా ఎక్కువ రోజులు ఆడే సత్తా ఉన్నది. కాబట్టి ప్రేక్షకులు కొంచెం ఆలస్యమైనా సినిమా ఖచ్చితంగా చూస్తారని ఆయన పరోక్షంగా తెలియజేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన నిర్మాత దిల్ రాజుకు ఈ మేరకు కౌంటర్ వేశారు. ఘాటైన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.

Waltair Veerayya
chiranjeevi

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు ఒక రోజు వ్యవధిలో విడుదలవుతున్నాయి. జనవరి 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య విడుదల తేదీలుగా ప్రకటించారు. అయితే దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రం విడుదల చేస్తున్నారు. ఇది డబ్బింగ్ మూవీ కావడంతో మొదట నిర్మాతల మండలి సంక్రాంతి విడుదలకు అభ్యంతరం తెలిపారు. అయితే దిల్ రాజు పంతం నెగ్గించుకున్నారు. ఇక తనను కాదని సొంతగా తమ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్న మైత్రీ మూవీ మేకర్స్ ని దెబ్బతీయాలని దిల్ రాజు థియేటర్స్ లాక్ చేశాడనే ప్రచారం జరుగుతుంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు థియేటర్స్ విషయంలో అన్యాయం జరగనుందని వార్తలు వస్తుండగా… రవిశంకర్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper