Pawan Kalyan On unstoppable 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ద్వారా మన ముందుకి రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే..ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ నేడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది..ఎన్నడూ లేని విధంగా ఈ షో నిర్వాహకులు అల్లు అరవింద్ మీడియా ముందుకి వచ్చి పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ మా షో కి రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక పవన్ కళ్యాణ్ కార్ నుండి దిగగానే బాలయ్య బాబు ఎదురొచ్చి ఆయనని హత్తుకొని గ్రాండ్ గా లోపలకి తీసుకెళ్లాడు..ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది..బాలయ్య లాంటి స్టార్ పవర్ స్టార్ కోసం ఈగో మొత్తాన్ని పక్కన పెట్టి సొంత తమ్ముడిలాగా ట్రీట్ చేసిన విధానం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎంతగానో నచ్చింది..సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ఈ సందర్భంగా బాలయ్య బాబు కి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు.
ఇక ఈ ఎపిసోడ్ హైలైట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము..ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు డైరెక్టర్ క్రిష్ కూడా హాజరయ్యారు..మధ్యలో పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా వస్తాడు..ఇక ఈ షో లో బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ మూడు వివాహాల గురించి ఒక ప్రశ్న అడుగుతాడు..ముందుగా బాలయ్య మాట్లాడుతూ ‘ఈ పెళ్లిళ్ల గోల ఏంటయ్యా’ అని పవన్ కళ్యాణ్ ని అడుగుతాడు.

అప్పుడు పవన్ కళ్యాణ్ తాను ఎందుకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో చాలా వివరణగా చెప్తాడు..అదంతా విన్న తర్వాత బాలయ్య బాబు మాట్లాడుతూ ‘ఇంత వివరణగా చెప్పిన తర్వాత కూడా ..ఈ మ్యాటర్ మీద విమర్శించే వాళ్ళు ఊర కుక్కతో సమానం’ అంటూ బాలయ్య బాబు చెప్తాడు..ఇలా ఈ ఎపిసోడ్ మొత్తం ఇలాంటి మూమెంట్స్ తో నిండిపోయి ఉంటుంది..ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ లాగ ఉంటబోతుంది ఈ ఎపిసోడ్.