Homeట్రెండింగ్ న్యూస్Tomato Prices Increase: కూరలో వేశాడని.. దంపతులను విడగొట్టిన టమాటా..!

Tomato Prices Increase: కూరలో వేశాడని.. దంపతులను విడగొట్టిన టమాటా..!

Tomato Prices Increase: టమాటా.. పెట్రోల్‌ ధరని మించి మండుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా ఇదే పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనివిధంగా సెంచరీ దాటడంతో పేద, మధ్య తరగతి ప్రజలు టమాటా కొనడమే మానేశారు. కొన్నా.. పావుకిలో.. అరకిలో మించి కొనడం లేదు. ఇక గృహిణులు అయితే పచ్చడి, ఉల్లిగడ్డ టమాటా.. కోడిగుడ్డ టమాటా.. ములక్కాడ టమాటా.. టమాట పప్పు.. టమాట రైస్, టమాటా చారు.. ఇప్పుడు టమాట లేకుండానే వంటలు వండుతున్నారు. ఇళ్లు నడిపేది ఇల్లాలే కాబట్టి.. మాట వినని టమాటాను దూరం పెడుతున్నాయి. ఇక టమాటా విలువ పెరగడంతో దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఓ భర్త కూరలోకి టమాటా వేశాడు. ఈ విషయం తెలిసి భార్య కూతుర్ను తీసుకుని ఇంటి నుంచే వెళ్లిపోయింది.

దంపతుల మధ్య విభేదాలు..
మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. టమాటాల కారణంగా భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇది మరింత పెద్దదిగామారడంతో భార్య తమ కుమార్తెతో సహా ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. టిఫిన్‌ సెంటర్‌ నడుపుతున్న సంజీవ్‌వర్మ¯Œ వంటలు చేస్తున్న సందర్భంలో కూరలో టమాటాలు వినియోగించాడు. దీనిని గమనించిన అతని భార్య.. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇంటి నుంచి వెళ్లిపోతానని బెదిరించింది. అయితే భర్త ఇకపై ఇలాంటి తప్పు చేయనని, భవిష్యత్‌లో ఎప్పుడూ టమాటా జోలికి వెళ్లనని హామీ ఇచ్చాడు. ఆమె భర్త మాటను పట్టించుకోకుండా ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది.

పోలీసులకు ఫిర్యాదు..
దీంతో ఆందోళన చెందిన భర్త తన భార్యను గాలించేందుకు పోలీసులను ఆశ్రయించాడు. భార్య అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంజీవ్‌ నుంచి అతని భార్య ఆరతి ఫోన్‌ నంబరు తీసుకుని ట్రేస్‌ చేశారు. ఆమె ఉమరియాలోని తన సోదరి ఇంటివద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. ఆ దంపతుల మధ్య సయోధ్య కుదిర్చారు. ధనపురి పోలీస్‌స్టేషన్‌ అధికారి సంజయ్‌ జైశ్వాల్‌ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఆరతివర్మ తమతో ఫోనులో మాట్లాడినప్పుడు తన భర్త తాగివచ్చి తనను, కుమార్తెను కొడుతుంటాడని ఫిర్యాదు చేసిందన్నారు. సందీప్, ఆరతిలకు 8 ఏళ్లక్రితం వివాహమయ్యిందని, వారికి 4 ఏళ్ల కుమార్తె ఉన్నదని తెలిపారు. కాగా దేశంలో టమాటా ధరలు మండిపోతున్న నేప«థ్యంలో వీటి కొనుగోలు, విక్రయాల విషయమై పలు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular