Tarakaratna Health condition : నందమూరి తారకరత్న రీసెంట్ గా నారా లోకేష్ చేపట్టిన ‘యువ గళం’ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అక్కడికక్కడే కుప్పకూలిపోయిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత వెంటనే ఆయనని సమీపం లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకొని పోగా వాళ్ళు మెరుగైన వైద్యం కోసం బెంగళూరికి తరలించామని సూచించారు.
బెంగళూరు లోని నారాయణ హృదయాలయ లో చాలా కాలం వరకు ట్రీట్మెంట్ తీసుకున్న తారకరత్న ఆరోగ్యం ప్రాణాపాయం నుండి బయటపడింది కానీ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం తో కోమాలోకి వెళ్ళాడు.తిరిగి ఆయనని మళ్ళీ స్పృహ లోకి తీసుకొని రావడానికి డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, ఎలాంటి స్పందన లేదు.దీనితో మరింత మెరుగైన వైద్యం అందించడం కోసం ఆయనని విదేశాలకు తరలించారు.ఇన్ని రోజులు ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఎలాంటి అప్డేట్ లేదు.
కానీ ఈరోజు ఉదయం తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై ఒక అప్డేట్ వచ్చింది.వైద్యులు తారకరత్న బ్రెయిన్ ని స్కాన్ చెయ్యగా, ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని,ఆయన కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.కానీ ఇంతకు ముందు తో పోలిస్తే తారకరత్న ప్రస్తుతం వైద్యానికి వేగంగానే స్పందిస్తున్నాడట.అతనిని స్పృహలోకి తీసుకొని వచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వైద్యులు.
మరోపక్క అభిమానులు కూడా తారకరత్న తొందరగా కోలుకొని చలాకీగా మన ముందుకు రావాలని దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు.ఇక నందమూరి బాలకృష్ణ అయితే తనకి ఉన్న పనులన్నిటినీ పక్కన పెట్టేసి తారకరత్న ఆరోగ్యం కోలుకునేందుకు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నాడు.ఎప్పుడెప్పుడు తారకరత్న కోలుకున్నాడు అనే వార్త వింటామా అని కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులూ కూడా కోరుకుంటున్నారు.