Homeజాతీయ వార్తలుMLC Kavitha: ఢిల్లీకి కవిత.. రెచ్చిపోతున్నారు.. గతంలో ఏ నేతకు ఇలా జరగలేదు..!

MLC Kavitha: ఢిల్లీకి కవిత.. రెచ్చిపోతున్నారు.. గతంలో ఏ నేతకు ఇలా జరగలేదు..!

MLC Kavitha
MLC Kavitha

MLC Kavitha: కల్వకుంట్ల వారసురాలు.. బీజేపీ నేతలు లిక్కర్‌ క్వీన్‌ అని పిలుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు గారాల పట్టి.. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా నెట్టింట్లో తెగ ట్రోల్‌ అవుతోంది. గతంలో ఏ నేత కూడా ఇంతలా ట్రోల్‌ కాలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీకి వెళ్లడాన్ని ఇంతలా ట్రోల్‌ చేయడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈడీ నోటీసులు.. ఢిల్లీ ప్రయాణం..
ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవిత పేరు మూడునెలలుగా ప్రధానంగా వినిపిస్తోంది. ఈ కేసులో మనీష్‌ సిసోడియా అరెస్ట్‌ తర్వాత ఇక కవితే అని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో కవిత ఢిల్లీలో మహిళా రిజర్వేషన్‌ కోసం దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఈనెల 10న ముహూర్తం ఫిక్స్‌ చేశారు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని విధంగా కవితకు మహిళా దినోత్సవం రోజు ఈడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 9న విచారణకు ఢిల్లీ రావాలని సూచింది. అయితే అప్పటికే ఆమె దీక్ష కోసం 8న సాయంత్రం ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాకతాళీయమో, కావాలని చేశారో తెలియదు కానీ ఇంతలో ఈడీ నోటీసులు వచ్చాయి. దీంతో ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్‌ పోర్టుకు వెళ్లిన కవిత వీడియో న్యూస్‌ చానెళ్లలో ప్రచారమైంది.

ఆ వీడియోనే నెట్టింట వైరల్‌..
కవిత ఎయిర్‌ పోర్టుకు వెళ్తున్న వీడియో బయటకు వచ్చిన మరు క్షణమే నెట్టింటో చక్కర్లు కొడుతోంది. కవిత ఒంటరిగా ఎయిర్‌ పోర్టులోకి వెళ్తున్న వీడియోకు తమకు నచ్చిన పాటను జోడించి వైరల్‌ చేస్తున్నారు. ‘చిలకా.. ఏ తోడు లేక ఎటైపమ్మ ఒంటిరి నడకా..’ అని ఒకరు.. ‘ఏ మున్నదక్కో.. ఏమున్న దక్కా…’ అనే పాటతో మరి కొందరు..
‘‘వక్క వక్క ఉయ్యాలో..
ఎటూ పోతున్నవ్‌ వక్క ఉయ్యాలో..
ఢిల్లీ వాళ్లు పిలిచిరి ఉయ్యాలో..
ఢిల్లీ పోతున్నా ఉయ్యాలో..
ఢిల్లీ కి ఎందుకు పిలిచిర్రు ఉయ్యాలో ..
నిన్ను ఎట్లా పీలిచిర్రు ఉయ్యాలో..
లిక్కర్‌ స్కాంలో ఇరికిన ఉయ్యాలో..
వాళ్లు పిలిచిల్లు ఉయ్యాలో..
పోయిరా వక్క ఉయ్యాలో..
మళ్లీ రాకు వక్క ఉయ్యాలో… అంటూ ఇంకొందరు.

హ్యాపీ జర్నీ అక్క అని అనేక మంది కవితను ట్రోల్‌ చేయడం చర్చనీయాంశమైంది.

MLC Kavitha
MLC Kavitha

అరెస్ట్‌ కోసం వేయిట్‌ చేస్తున్నారా?
కవితను ట్రోల్‌ చేస్తున్నవారిలో విపక్ష బీజేపీ నేతలతోపాటు సమాన్యులు కూడా ఉండడం గమనార్హం. నిరుద్యోగులు, పేద, సమాన్యులు, యువకులు, స్టూడెంట్స్, మహిళలు, యువతులు కూడా ఉన్నారు. తాజాగా కవితను ఇంతలా ట్రోల్‌ చేయడం చూస్తుంటే తెలంగాణలో మెజారిటీ ప్రజలు కవితను అరెస్ట్‌ చేయాలనే భావిస్తున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవితకు నోటీసులను బీఆర్‌ఎస్‌ నేతలు మినహా ఎవరూ ఖండించడంలేదు. కనీసం మహిళ అనే సానుభూతి కూడా కవితపై కనిపించడం లేదు. మొత్తంగా సోషల్‌ మీడియా చరిత్రలో ఏ నేతను ట్రోల్‌ చేయని విధంగా కవితను నెటిజన్లు ట్రోల్‌ చేయడం ఆసక్తిగా మారింది.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper