spot_img
Homeజాతీయ వార్తలుKarnataka Assembly Elections 2023: కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్‌..!

Karnataka Assembly Elections 2023: కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్‌..!

Karnataka Assembly Elections 2023
Karnataka Assembly Elections 2023

Karnataka Assembly Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మే 10 ఒకే విడతలతో ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు అన్ని పార్టీలు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. అయితే బీజేపీకి మరోమారు అవకాశం వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ ఏడాది చివరన జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో ఎవరు గెలిస్తే.. తెలంగాణలో వారికే అడ్వాంటేజ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అక్కడి రిజల్ట్‌.. ఇక్కడ రిపీట్‌!
కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం అనే సమీకరణమే కాదు కర్ణాటక తరహాలో కాంగ్రెస్, బీజేపీ కూడా అధికారం కోసం పోరాడుతున్నాయి. రాజకీయాలను చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఒక రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు దాని పక్క రాష్ట్రంలో పడటం సర్వసాధారణం. తెలంగాణలో కాంగ్రెస్‌ మెల్లిమెల్లిగా పుంజుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వారికి నైతిక ధైర్యం కావాలి. ఆ ధైర్యం కర్ణాటక ప్రజలు ఇస్తారని నమ్ముతున్నారు.

కాంగ్రెస్‌లో ఆశలు..
కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ నేతలు సంబరాలు చేసుకోవడం ఖాయం. సరిహద్దు ప్రాంతాల్లో ఆ ప్రభావం నేరుగా ఉంటుంది. అలాగే ప్రజల్లో కూడా గెలిచే పార్టీ కాంగ్రెస్‌ అన్న భావన వస్తుంది. అందుకే కాంగ్రెస్‌ పార్టీ నేతలు కర్ణాటకలో గెలవడానికి ఎలాంటి సహకారమైనా అందిస్తామని అక్కడి నేతలకు చెబుతున్నారు. ప్రచారానికి వెళ్తున్నారు. పాదయాత్రను పక్కన పెట్టి రేవంత్‌ రెడ్డి కూడా తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రేవంత్‌రెడ్డి కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి.

Karnataka Assembly Elections 2023
Karnataka Assembly Elections 2023

బీజేపీ ధీమా..
దక్షిణాదిన ఎదగాలనుకుంటున్న బీజేపీ కాలం కలసి రావడం లేదు. బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరు ఉంది. దీనికి కారణం దక్షిణాదిన ఆ పార్టీకి పెద్దగా బలం లేకపోవడమే. అతి కష్టం మీద కర్ణాటకలో రెండు మూడు సార్లు అధికారం దక్కించుకుంది. కానీ ఇప్పుడు అక్కడ ఎదురుగాలి వీస్తోంది. అయితే సర్వేలు మాత్రం బీజేపీకే అధికారం వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమలనాథుల్లో ధీమా కనిపిస్తోంది. అక్కడ గెలిస్తే తెలంగాణలో అధికారం ఖాయంని నమ్ముతున్నారు.
తెలుగు వారి ఓట్లు కీలకం..
కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజల ఓట్లను కీలకంగా భావిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి కూడా తెలుగు ఓటర్లను టార్గెట్‌గా చేసుకుని అక్కడ రాజకీయాలు చేయాలని చూస్తోంది. పోటీ చేసే అవకాశం మాత్రం కనిపించడం లేదు. అయితే జేడీఎస్‌కు మద్దతు పలికే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌ మద్దతులో జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ అయితే.. భారత రాష్ట్ర సమితికి అడ్వాంటేజ్‌ అవుతుంది.

మొత్తంగా ఏరకంగా చూసినా కర్ణాటక, తెలంగాణ రాజకీయాలు ఒకే విధంగా కనిపిస్తున్నాయి. అందుకే కర్ణాటకలో తమ పార్టీ గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper