Anant Ambani Watch: జామ్ నగర్ వేదికగా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ముందస్తు వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారంతో ఆ వేడుకలు ముగియనున్నాయి. శుక్రవారం డ్రోన్ షో, కాక్ టెయిల్ పార్టీ, శనివారం సంగీత్, దాండియా వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో అతిరథ మహారధులు సందడి చేశారు. ముఖ్యంగా హాలీవుడ్ పాప్ సింగర్ రెహన్నా పాడిన పాటలు వేడుకకు సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ కూడా డ్యాన్స్ చేసి అతిథులను అలరించారు.
ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అనంత్ అంబానీ ధరించిన వాచ్ లు చర్చనీయాంశంగా మారాయి. అతడు ఏకంగా 63 కోట్ల విలువైన పాటెక్ ఫిలిప్ కంపెనీకి చెందిన వాచ్ ధరించాడు. అంతేకాకుండా రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన 14 కోట్ల విలువైన వాచ్ కూడా ధరించాడు. అనంత్ అంబానీ ధరించిన వాచ్ లను చూసి ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, అతడి సతీమణి ఫిదా అయ్యారని వార్తలు వస్తున్నాయి. మనిష్ మల్హోత్రా రూపొందించిన దుస్తులను అతడు ధరించాడు. కేవలం ఈ మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుకల కోసం సుమారు 50 రకాల దుస్తులను అనంత్ అంబానీ కోసం మనీష్ మల్హోత్రా రూపొందించాడు. ఇక రాధికా మర్చంట్ ధరించిన దుస్తులు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువుల ధర కూడా కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది.
ఈ వేడుకల కోసం ముఖేష్ అంబానీ దాదాపు 1000 కోట్ల వరకు కట్ దాదాపు 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. పాప్ గాయని రిహన్నా కు 75 కోట్ల దాకా చెల్లించారని, వచ్చిన అతిధుల కోసం 2500 రకాల వంటకాలను వడ్డించారని వార్తలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన పాకశాస్త్ర నిపుణులతో ఈ వంటకాలు వండించారని తెలుస్తోంది. కాగా అనంత్ అంబానీ ధరించిన వాచ్ లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి..
Velishala Suresh is a Web Admin and is working with our organisation from last 3 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More