spot_img
Homeట్రెండింగ్ న్యూస్China Health Garage: హెల్త్‌ గ్యారేజ్‌.. అక్కడ సుత్తి... రించ్, ఉలితోనే ట్రీట్‌మెంట్‌..!

China Health Garage: హెల్త్‌ గ్యారేజ్‌.. అక్కడ సుత్తి… రించ్, ఉలితోనే ట్రీట్‌మెంట్‌..!

China Health Garage: గ్యారేజ్‌.. ఈ పదం అందరికీ పరిచయం ఉన్నదే.. కార్లు రిపేర్లు చేసే షెడ్డును కార్ల గ్యారేజీ అని, లారీలు రిపేర్‌ చేస్తే లారీ గ్యారేజ్‌ అని, బస్సులు రిపేర్‌ చేస్తే.. బస్‌ గ్యారేజ్‌ అని అంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు, వంకర మార్గంలో నడిచే, అక్రమాలకు పాల్పడే మనుషులను రిపేర్‌ చేసే గ్యారేజ్‌ కూడా జనతా గ్యారేజ్‌ పేరుతో సినిమా తీశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చైనాలె వెలసిన గ్యారేజ్‌ కొత్తగా ఉంది. దానిపేరు హెల్త్‌ గ్యారేజ్‌ అంట.. అక్కడ అన్ని రకాల రోగాలకు రిపేర్లు చేస్తున్నారు. అందుకే దానిని గ్యారేజ్‌ అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.

చికిత్స విధానం తెలుసా..
ఈ హెల్త్‌ గ్యారేజీలో చికిత్స కూడా వెరైటీగా ఉంది. మెకానిక్‌ గ్యారేజీలో వాహనాలకు రిపేర్‌ చేసినట్లుగానే.. ఈ గ్యారేజీలో మనుషుల రోగాలకు రిపేర్‌ చేస్తున్నారు. మెకానిక్‌ షెడ్డులో ఉన్నట్లుగానే ఇక్కడ సెట్టింగ్, బెండింగ్‌ తీసే పెద్దపెద్ద పరికరాలు ఉన్నాయి.

మెకానిక్‌ డాక్టర్లు..
ఇక ఇక్కడ డాక్టర్లు ఎవరంటే.. ఎముకల బెండు తీసేవారు, వంగిపోయిన వెన్నుపూస సరిచేసేవారు, బిగుసుకుపోయిన ఎముకలు సాఫ్‌ చేసేవారు. ఇక ఈ డాక్టర్ల దగ్గర ఉండే పరికకాలు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ హెల్త్‌ గ్యారేజీలో డాక్టర్లు ఉపయోగించేవి సుత్తి, రించ్, ఉలి లాంటి పరికరాలే.

ఎముకలకు మరమ్మతు..
చైనా వాడు ఏది చేసినా కొత్తగా, వెరైటీగా ఉంటుంది. హెల్త్‌ గ్యారేజీ కూడా అలాగే ఉంది. ఇక్కడ ఎముకల చికిత్స మాత్రమే చేస్తున్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. అయితే ఆ చికిత్స విధానమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. వెన్నుపూస జాయింట్స్‌ సరిచేసేందుకు సుత్తి ఉలిని ఉపయోగిస్తున్నారు. నరాలు సాఫ్‌ చేసేందుకు బాడిషెతో లాంటి పరికరంతో మసాజ్‌ చేస్తున్నట్లు ఉంది. ఈ చికిత్స కూడా బాగా పనిచేస్తున్నట్లుగానే వీడియోలో ఉంది. ఓ మహిళకు ట్రీట్‌మంట్‌ చేసి ఆమెను నడిపిస్తున్నట్లుగా వీడియోలో చూపారు. కొత్తగా, వింతగా ఉన్న ఈ హెల్త్‌ గ్యారేజ్‌ వీడియో ఇప్పుడు నెట్టిట్లో వైరల్‌ అవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
AP MLC Elections

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper