Nita Ambani Birthday: దేశంలోనే అత్యంత ఖరీదైన పుట్టిన రోజు వేడుక అది.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ జరుపుకున్నారు. ఈ వేడుకను. ఇందుకు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ రాజభవనాలు వేదికయ్యాయి. దేశంలో కనీవిని ఎరుగని రీతిలో ఈ వేడుకలకు హాజరు కావడానికి భారతదేశంలోని ప్రముఖులు తమ ప్రైవేట్ జెట్‌లలో, కొంతమంది భారతదేశపు అతిపెద్ద కంపెనీల చార్టర్డ్‌లో ప్రయాణించి వచ్చారు.
50వ బర్త్‌డే..
నీతా అంబానీ 50వ జన్మదిన వేడుకలకు వేదికగా అంబానీలు రెండు రాజభవనాలను బుక్ చేసుకున్నారు – ఉమైద్ భవన్ ప్యాలెస్, బాల్సమండ్ లేక్ ప్యాలెస్. ఈ వేడుకలకు దాదాపు 300 మంది వీవీఐపీ అతిథులు హాజరయ్యారు. వీరిలో గోద్రెజ్‌లు, మిట్టల్స్, మహీంద్రాలు వంటి కొన్ని సంపన్న వ్యాపార కుటుంబాలు ఉన్నాయి. షారూఖ్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, రాణి ముఖర్జీ వంటి అర్టిస్టులతోపాటు క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, ముంబై ఇండియన్ జట్టు క్రీడాకారులు ఉన్నారు. జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల కోసం స్థలం లేకుండా పోయింది అంటే ఎంతమంది వీవీఐపీలు వచ్చారో అర్థం చేసుకోవచ్చు.
ప్రత్యేక ఆకర్షణగా ఆటా పాట..
జోధ్‌పూర్ చాలా కాలం తర్వాత నక్షత్రాలతో నిండిపోయింది. భారతదేశపు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ మాస్ట్రో అఖరెహమాన్ ఆటా పాటలు నీతా అంబానీ బర్త్‌డే వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. నీతా–ముఖేశ్‌అంబానీల కుమార్తె ఇషా అంబానీ కూడా ప్రత్యేక ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ప్రముఖ వ్యాపార దిగ్గజం ధీరూభాయ్ అంబానీ కుటుంబ పితామహుడు ధీరూభాయ్ అంబానీని సత్కరిస్తూ స్పెషల్ ఎఫెక్ట్‌లతో కూడిన లైట్ షో మరొక హైలైట్. ఈ వేడుకలు 2013, అక్టోబర్ 13న జరిగాయి. అయితే దేశంలో ఇప్పటికీ ఇదే అత్యంత ఖరీదైన పుట్టిన రోజు వేడుకగా నిలిచింది. ఈ పుట్టిన రోజు వేడుకకు రూ.220 కోట్లు ఖర్చు చేశారట.