spot_img
Homeఎంటర్టైన్మెంట్Bitthiri Sathi: భగవద్గీతతో పెట్టుకున్నడు.. బాంచెన్‌ క్షమించండి అని బతిమాలుతున్నడు.. ఎంది సత్తీ ఇదీ!?

Bitthiri Sathi: భగవద్గీతతో పెట్టుకున్నడు.. బాంచెన్‌ క్షమించండి అని బతిమాలుతున్నడు.. ఎంది సత్తీ ఇదీ!?

Bitthiri Sathi: బిత్తిరి సత్తి… అలియాస్‌ చేవేళ్ల రవి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు. పలు న్యూస్‌ ఛానెళ్లలో పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేగ గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణ యాస, వింతైన హావభావాలతో అందరినీ ఆకట్టుకున్నారు. వీ6లో ప్రసారమయ్యే తీన్మార్‌ వార్తలతో వెలుగులోకి వచ్చాడు. తర్వాత టీవీ9, సాక్షి న్యూస్‌ ఛానెళ్లలోనూ పనిచేశారు. వీ6లో సావిత్రి, బిత్తిరి సత్తి కాంబినేషన్‌ బాగా సక్సెస్‌ అయింది. అయితే తర్వాత కాలంలో ఆ వార్తల రేటింగ్‌ తగ్గడంతో బిత్తిరి సత్తి బయటకు వచ్చేశారు. న్యూస్‌ రీడర్‌గా ఉన్నప్పుడే కొన్ని సినిమాల్లో నటించారు. తుపాకి రాముడు సినిమాలో హీరోగా కూడా చేశారు. కొన్ని సినిమా ఫంక్షన్లకు యాంకర్‌గా, గెస్ట్‌గా, వ్యవహరించారు. కొన్ని టీవీ ప్రోగ్రాంలలో కూడా పార్టిసిపేట్‌ చేశారు. ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టుకుని ప్రోగ్రాంలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతను కించపరిచేలా బిత్తిరిసత్తి చేసిన వీడియో ఇపుపడు కాంట్రవర్సీకి కారణమైంది. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో ఆగ్రహించిన ఈ సంఘాలు బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రై మ్‌ లో ఫిర్యాదు చేశాయి. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

జీరో నుంచి హీరో వరకు..
బిత్తిరి సత్తి అలియార్‌ రవి మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. జీరో స్థాయి నుంచి హీరో వరకు ఎదిగాడు ఇందుకు ఎంతో కష్టపడ్డాడు. న్యూస్‌ రీడర్‌ నుంచి సినిమాలో హీరోగా కూడా చేశారు. అయితే.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉంటాలంటారు. కానీ బిత్తిరి సత్తి.. తన సెలబ్రిటీ ఇమేజ్‌ను దుర్వినియోగం చేసి చాలాసార్లు కాంట్రవర్సీ అయ్యాడు. తాజాగా ఆయన చేసిన ఓ వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ.. తనదైన శైలిలో వ్యంగ్యంగా బిత్తిరి సత్తి చేసిన స్కిట్‌పై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. అటు హిందూ సంఘాలు కూడా ఈ బిత్తిరి సత్తి చేసిన ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వీడియో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని మండిపడుతున్నాయి. ఈ సందర్బంగా ప్రముఖ హిందూ సంఘం అయిన రాష్ట్రీయ వానరసేన వాళ్లు ఈ వీడియోపై బిత్తిరి సత్తికి అల్టీమేటం జారీ చేశారు. అంతేకాదు సోషల్‌ మీడియాలో వీడియోను తెలిగించి హిందూ సంఘాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మొదట సమర్థించుకుని.. ఇప్పుడు క్షమాపణ..

ఇదిలా ఉంటే.. బిత్తిరి సత్తి తన వీడియోలో భగవద్గీతను కించపరిచేలా లేవని సమర్ధించుకున్నాడు. హిందూ సంఘాలు తనపై ఎలాంటి కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్దమని వాళ్లకు సవాల్‌ విసిరారు. దీంతో హిందూ వానర సేన సభ్యులు సైబర్‌ క్రై మ్‌ పోలీసులను ఆశ్రయించి బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సైబర్‌ క్రై మ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ 24 గంటల్లోనే సత్తి తన మనసు మార్చుకున్నాడు. ఇటీవల విడుదల చేసిన వీవియోలో హాస్యం పండించే క్రమంలో భగవద్గీతపై తప్పు దొర్లిందని అంగీకరించాడు. తాను భగవద్గీతను నమ్ముతానని, ఆరాధిస్తానని, పారాయణం చేయడానికి ప్రయత్నిస్తాననరి చెప్పాడు. ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించలేదని పేర్కొన్నారు. ఎవరిని అయినా నొప్పించి ఉంటే మన్నించాలని కోరాడు. ఈమేరకు ఎక్స్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు.

బీఆర్‌ఎస్‌ కార్యకర్తగా..
ఇదిలా ఉంటే.. బిత్తిరిసత్తి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం చేశారు. ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన బిత్తిరి సత్తి చేరికతో పార్టీకి బలం పెరిగిందని హరీశ్‌రావు కూడా ప్రకటించారు. కానీ, ఎన్నికల్లో ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో బిత్తిరిసత్తి పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Andhra Pradesh Investments

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....
Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
Oktelugu Epaper