Bheemla Back On Duty: భీమ్లానాయక్ మేనియాను మరింత పెంచేలా.. ఫ్యాన్స్ లో జోష్ ను రెట్టింపు చేసేలా చిత్రం యూనిట్ మరో సాంగ్ ను వదిలింది. భీమ్లానాయక్ లోని ఎమోషనల్ సీన్లను ఎలా షూట్ చేశామో వివరిస్తూ ఒక ర్యాప్ సాంగ్ ను రూపొందించింది. ఇందులో పలువురి మాస్ లేడీస్ ను పెట్టి డ్యాన్స్ చేయిస్తూ సంగీత దర్శకుడు తన్ ర్యాపర్ లా మారి దంచి కొట్టాడు.

భీమ్లానాయక్ ఆన్ డ్యూటీ’ పేరుతో విడుదలైన ఈ కొత్త భీమ్లానాయక్ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ‘వచ్చాడు భీమ్లా’ అంటూ మొదలైన ఈ సాంగ్ ను తమన్ సరికొత్తగా రూపొందించి షేక్ చేశాడు. హాట్ లేడీ డ్యాన్సర్లతో సినిమాలోని పోరాట సన్నివేశాల మేకింగ్ వీడియోను రూపొందించారు.
Also Read: Anchor Suma: సుమ యాంకరింగ్ యే కాదు.. ఇలాంటి పనులు కూడా చేస్తోందా?
పవన్ ఫ్యాన్స్ జోష్ రెట్టింపు చేసేలా ఈ పాట ఉంది. ఇందులో ఒకే బైక్ పై పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ కలిసి సాగే సీన్ హైలెట్ గా చెప్పొచ్చు. ఇక మేకింగ్ సీన్లు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. సీన్లను ఎంత కష్టపడి తీశారో అందులో అర్థమవుతోంది.
Also Read: Pooja Hegde: సక్సెస్ అనబోయి సె** అనేసిన పూజా హెగ్డే
మొత్తంగా భీమ్లానాయక్ లోని పాటలు ఇప్పటికే గ్రాండ్ హిట్ అయ్యాయి. సినిమా సక్సెస్ అయిన దృష్ట్యా మరో సరికొత్త పాటను ర్యాప్ గా పాడి తమన్ పవన్ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ అందించాడు. మీరూ ఆ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి.