Bandi Sanjay: ‘ట్రిపుల్ ఆర్’ సినిమా ఇంకా రిలీజ్ కాలే. ట్రైలర్ చూసే సీఎం కేసీఆర్ కు వణుకు పుడుతోంది. సినిమా రిలీజ్ అయితే ఆయన గుండె ఆగిపోతదేమోనని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ పై ప్రశ్నించకూడదనే బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజేందర్, రఘునందన్, రాజాసింగ్ (ఆర్ఆర్ఆర్) లను కేసీఆర్ సస్పెండ్ చేశారని ఎద్దేవా చేశారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని చురకలంటించారు.
ఎన్ని సమావేశాలు జరుగుతాయో తెలియకుండానే బీజేపీ ఎమ్మెల్యేలను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. సస్పంెడ్ చేస్తున్నట్టైతే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలను ప్రగతి భవన్ లో, ఫాంహౌస్ లో నిర్వహించుకోవాలని సెటైర్ వేశారు.ముందస్తు ప్లాన్ ప్రకారమే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ సస్పెండ్ చేశారని ఆరోపించారు.
ఈరోజు శాసనసభలో జరిగిన సంఘటనలు చూస్తే… తెలంగాణ లో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందనే విషయం అసెంబ్లీ సాక్షిగా మరోసారి స్పష్టమైంది. అసలు బీజేపీ సభ్యులను ఎందుకు సస్పెండ్ చేసిండ్రో ఎవరికి అర్ధం కాలేదని. అసలు వాళ్లు చేసిన తప్పేంది? అని ప్రశ్నించారు.
-బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ..
• ప్రజాస్వామ్యబద్దంగా సభను కొనసాగించాలి…. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరడమే బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన తప్పా?
• వాళ్లు సభను కూడా అడ్డుకోలేదు. సభలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదే. అయినా సస్పెండ్ చేయడమేంది?
• ఇదంతా కేసీఆర్ ప్రీ ప్లాన్ . ముందే రాసుకున్న స్ర్కిప్ట్ ను అమలు చేసిండు. ఇంతకంటే మూర్ఖత్వం, పిరికితనం ఇంకోటి కాదు.
• చివరకు మా ఎమ్మెల్యేలు సస్పెండ్ ను నిరసిస్తూ ప్రజాస్వామ్యబద్దంగా అసెంబ్లీ ఆవరణలో ధర్నా చేస్తే కూడా సహించలేక అరెస్టు చేసిండ్రు.
• సభలో బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తే.. సీఎం సైగలు చేయగాటనే ఒక మంత్రి పోయి కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడుతున్నరు.
• తెలంగాణ ఉద్యమకారులు సభలోకొస్తే బండారం బయటపడుతుందేమోననే భయంతోనే ఇదంతా చేస్తున్నరు.
• టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదు. అందుకే చర్చ జరిగితే ఇదంతా బయటపెడతారనే భయంతోనే సస్పెండ్ చేసినట్లు కన్పిస్తోంది.
• ఈ మాత్రం దానికి అసెంబ్లీ ఎందుకు? ప్రగతి భవన్ లోనో, ఫాంహౌజ్ లోనే నీ కొడుకు, బిడ్డ, అల్లుడు, నీ చెంచాగాళ్లతో సభ పెట్టుకుంటే సరిపోతుంది కదా… నిన్నెవరూ అనేవాళ్లు కూడా ఉండరు కదా..
• రాష్ట్రానికి నువ్వు ఒరగబెట్టిందేమీ లేదు కాబట్టే గవర్నర్ ప్రసంగం కూడా లేకుండా చేసిన నీచమైన చరిత్ర టీఆర్ఎస్ దే.
• ఎవరైనా గొడవ చేస్తే ఒకరోజు, రెండ్రోజులు సస్పెండ్ చేయడం చూసినం. ఇక్కడ వాళ్లు గొడవ పడిందీ లేదు. అయినా బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేశారంటే… వాళ్లను చూస్తే కేసీఆర్ ఎంత గజగజ వణుకుతున్నడో తెలుస్తోంది.
• మహారాష్ట్రలో గిట్లనే 12 మంది శాససభ్యులను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఈ సంగతి గుర్తుంచుకో…
• కేసీఆర్…. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తేలేదు. చట్టపరంగా, న్యాయపరంగా కొట్లాడతాం. కోర్టులను ఆశ్రయిస్తాం. గవర్నర్ ను కలవబోతున్నం. ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపబోతున్నం.
• కేసీఆర్ …నువ్వు నిజంగా సచ్చీలుడవైతే..నిజంగా రాష్ట్రాన్ని అభివ్రుద్ధి చేసినట్లు భావిస్తే మా ఎమ్మెల్యేలపై సస్పెండ్ ఎత్తేయాలి. మా సభ్యులడిగే ప్రశ్నలకు సభలో సమాధానం చెప్పాలి. ఆ ధైర్యం నీకుందా?
• సీఎం కేసీఆర్ ఫేస్ టు ఫేస్ కొట్లాడలేని పరికిపంద. కాంగ్రెస్, ఎంఐఎం లను అడ్డుపెట్టుకుని బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నరు. డ్రామా చేస్తున్నరు.
• నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుధ్ధి ఉంటే… ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఈరోజు సభలో జరిగిన ఘటనను సమర్ధిస్తారా?
Also Read:TRS vs BJP: బీజేపీ నేతలపై కేసులు..? టీఆర్ఎస్ ది కుట్రపూరితమేనా?
• ఇగ బడ్జెట్ ను చూస్తే నవ్వొస్తుంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. కేసీఆర్ మాటల్లో నీతి అంతుంది. బడ్జెట్ ప్రసంగ పేజీలు పెంచిండు.. బరువు పెంచిండు. అబద్దాలు చెప్పిండు.
• ఎట్లాగూ సభను రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకు వెళతామనుకున్నట్లున్నడు. పేజీల కొద్దీ చదివిండు. వేల కోట్ల హామీలిచ్చిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వే ల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కోతలు కోస్తున్నడు.
• ఇదే కేసీఆర్ చివరి బడ్జెట్. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. అందుకే అమలు చేయని హామీలతో మాయ చేయాలనుకుంటున్నడు.
• కేసీఆర్ గత చరిత్ర తెలుసుకో… నీలాగే వ్యవహరించిన ప్రభుత్వాలకు ప్రజలు ఎట్లాంటి గుణపాఠాలు చెప్పారో తెలుసుకో…
• ఇప్పటికైనా సీఎం కళ్లు తెరవాలి. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బీజేపీ సభ్యులపై సస్పెండ్ ఎత్తేయాలి. సభలో సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి.
• నిజాయితీగా వ్యవహారించాలి. ప్రజాస్వామ్యబద్ద పాలన చేయాలి. లేకుంటే నీ నియంత పాలన కొనసాగనివ్వబోం. నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అడ్డుకుంటాం.
• గత శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గిట్లనే ప్రశ్న అడగాలని చెయ్యి ఎత్తితే.. కేసీఆర్ సస్పెండ్ చేసిండు. ఆనాడు ఖండించిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇప్పుడేం మాట్లాడరెందుకు? సమాధానం చెప్పాలి.
• విలేకరులు అడిగిన పశ్నకు… గతంలో శాసనసభలో టీఆర్ఎస్ చేసిన అరాచకాలు తెల్వదా? వీళ్లలాగా చేసుంటే సభలో ఎవరూ మిగలకపోయేవాళ్లు. గతంలో సభలో సమస్యలపై రోజుల తరబడి ధర్నాలు, నిరసనలు, గొడవలు చేసిన దాఖలాలున్నయ్. మీలాగా వ్యవహరించారా? పోనీ గతంలో మాదిరిగా కూడా బీజేపీ సభ్యులు వ్యవహరించలేదే. క్రమశిక్షణతో ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించారు. అయినా సస్పెండ్ చేస్తారా?
• కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ ఉన్నంత వరకు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయనీయం. నీ అరాచకాలను అడ్డుకుని తీరతాం.
• మీడియా సమావేశంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సంగప్ప తదితరులు ఉన్నారు.
Also Read: Director Arrested In Rape Case: అత్యాచారం చేశాడని నటి ఫిర్యాదు.. ప్రముఖ దర్శకుడి అరెస్ట్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Bandi sanjay very serious on cm kcr over bjp mlas suspension
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com