spot_img
Homeఎంటర్టైన్మెంట్Anchor Suma: అభిమానులకు గుండె పగిలే వార్త... కన్నీటి మధ్య యాంకరింగ్ కి గుడ్ బై...

Anchor Suma: అభిమానులకు గుండె పగిలే వార్త… కన్నీటి మధ్య యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన సుమ!

Anchor Suma: సిల్వర్ స్క్రీన్ పై మెగాస్టార్ చిరంజీవి ఎలాగో బుల్లితెరపై సుమ అలాగన్న మాట. యాంకర్ గా ఆమె నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తన మాటల గారడీతో దశాబ్దాల పాటు యాంకరింగ్ లో ఏకఛత్రాధిపత్యం చేసింది. సమయస్ఫూర్తి, మూడు నాలుగు భాషలు అనర్గళంగా మాట్లాడగల ప్రతిభ ఆమెను తిరుగులేని యాంకర్ ని చేశాయి. షో ఏదైనా సుమ యాంకర్ అయితే టీఆర్పీ పరుగులు పెట్టాల్సింది. పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి లెజెండరీ షోలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పట్టుకుంటే పట్టుచీర, భలే ఛాన్స్ లే, మహిళలు మహారాణులు వంటి లేడీస్ షోలు ఏళ్ల తరబడి కొనసాగాయి.

Anchor Suma
Anchor Suma

యంగ్ జనరేషన్ వచ్చినా కూడా 47 ఏళ్ల సుమకు తిరుగులేకుండా పోయింది. స్టార్ హీరోల సినిమా ఫంక్షన్స్ నుండి నంది అవార్డ్స్ వంటి భారీ వేదికలకు కూడా సుమనే అందరి ఛాయిస్. సుమ జైత్రయాత్ర చెప్పుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అవుతుంది. అలాంటి సుమ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పనున్నారన్న వార్త షాకింగ్ గా మారింది ఇటీవల ఓ షోలో పాల్గొన్న సుమ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

చాలా రోజులుగా సుమ యాంకరింగ్ మానేస్తున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. అవన్నీ పుకార్లు గానే మిగిలిపోయాయి. ఈసారి ఆమె స్వయంగా తెలియజేశారు. ‘ఒక మలయాళీ అమ్మాయిని అయిన నేను ఇక్కడ సెటిల్ కావడం నిజంగా అదృష్టం. తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలతోనే ఇది సాధ్యం అయ్యింది. అందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. కొంత కాలం యాంకరింగ్ కి విరామం తీసుకోవాలి అనుకుంటున్నాను. అయితే పూర్తిగా యాంకరింగ్ కి దూరం కాను, అని చెప్పుకొచ్చారు. కొంత బ్రేక్ తర్వాత మళ్ళీ తిరిగి వస్తానని చెప్పారు. అయితే సుమ యాంకర్ గా రిటైర్ అయ్యారనే మాట వినిపిస్తోంది.

Anchor Suma
Anchor Suma

ఈ మాటలు చెప్పేటప్పుడు సుమ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో సుమకు అవకాశాలు తగ్గాయి అనడంలో సందేహం లేదు. యాంకరింగ్ టాలెంట్ కి మించి గ్లామర్ యాంగిల్ తీసుకున్నాక ట్రెడిషనల్ యాంకర్స్ కి ఆఫర్స్ తగ్గాయి. రష్మీ, శ్రీముఖి, వర్షిణి, అనసూయ వంటి బోల్డ్ బ్యూటీస్ ఈ రంగంలో దూసుకుపోతున్నారు. అలా అని సుమ చేతిలో షోస్ లేవని కాదు. ప్రస్తుతం ఆమె క్యాష్ షో యాంకర్ గా ఉన్నారు. క్యాష్ చాలా కాలంగా ప్రసారం అవుతుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Balakrishna Injury

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper