Sreemukhi: స్టార్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియా అరాచకాలకు హద్దు లేకుండా పోతుంది. ఆమె హాట్ ఫోటో షూట్స్ మాత్రమే కాకుండా బోల్డ్ వీడియోలు కూడా షేర్ చేస్తుంది.తాజాగా ఏకంగా ప్యాంటు లేకుండా కెమెరా ముందు చిందులు వేసింది. శ్రీముఖి తెగింపు చూసి బుల్లితెర రాములమ్మకి ఏమైంది… అంటూ ఆశ్చర్యపోతున్నారు. పర్పుల్ కలర్ టాప్ ధరించిన శ్రీముఖి బోల్డ్ వీడియో చేశారు. ఇక తన వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.

హీరోయిన్స్ కి ఇంస్టాగ్రామ్ ఆదాయమార్గంగా మారిపోయింది. ఎంత మంది ఫాలోవర్స్ ఉంటే అంత మార్కెట్, ఆ రేంజ్ రెమ్యూనరేషన్. దాని కోసం ఇలాంటి వీడియోలు, హాట్ ఫోటో షూట్స్ చేస్తూ… కాకరేపుతున్నారు. ప్రస్తుతం శ్రీముఖిని ఇంస్టాగ్రామ్ లో 4.2 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. అంటే 42 లక్షల మందన్న మాట. శ్రీముఖి ఏదైనా పోస్ట్ పెడితే లక్షల్లో చూస్తారన్న మాట. దీంతో కొన్ని వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులను శ్రీముఖి ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రమోట్ చేసుకుంటున్నారు.
యాంకర్ గా ఒక ప్రక్క లక్షలు సంపాదిస్తూ సోషల్ మీడియాను కూడా వదలడం లేదు. జాతి రత్నాలు, మా పరివార్, మిస్టర్ అండ్ మిసెస్, డాన్స్ ఐకాన్ అంటూ నాలుగైదు షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది. యాంకర్ గా ఎపిసోడ్ కి లక్షలు వచ్చిపడుతున్నాయి. అలాగే ఇంటర్వ్యూలు,సినిమా ఈవెంట్స్, స్పెషల్ షోస్ ఇలా చేతి నిండా సంపాదన కలిగి ఉంది.

అలాగే హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా అంది వచ్చిన క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. సోలో హీరోయిన్ ‘క్రేజీ అంకుల్స్’ మూవీలో శ్రీముఖి నటించింది.సింగర్ మను, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రలు చేసిన ఆ మూవీ అంతగా ఆడలేదు. అలాగే ఇట్స్ టైం టు పార్టీ టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో కీలక రోల్ చేశారు. ఇవన్నీ చిన్న చిత్రాలు కావడంతో బ్రేక్ రావడం లేదు. అలా అని నిరాశ పడకుండా ప్రయత్నాలు చేస్తుంది. వెండితెరపై సక్సెస్ అయినా కాకున్నా ఆమెకు ఇబ్బందేమీ లేదు. యాంకర్ గా కెరీర్ కి గట్టి పునాది వేసుకుంది.
View this post on Instagram