Man Kiss Lady Cop: పోలీస్ అంటేనే సాధారణంగా భయం వేస్తుంది. దగ్గరకు వెళ్లి మాట్లాడడం ఇంకా సాహసమే. కానీ ఇక్కడో కానిస్టేబుల్ కానిస్టేబుల్‌ను కౌగిఇలించుకున్నాడు.. అంతేకాదు.. నడి రోడ్డుపైనే ముద్దు కూడా పెట్టాడు. ఆ కానిస్టేబుల్ పురుషుడు అనుకునేరు.. మహిళ. మరి ఇంత చేసినా ఆమె ఏమీ అనకుండా నవ్వుతే వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఏడుస్తూ వస్తున్నాడని..
పోలీస్ అంటే.. చట్టాలను అమలు చేయడం, శాంతిభద్రలను పరిరక్షించడం, ప్రజలకు రక్షణ కల్పించడం. ఇవన్నీ చూసుకునేది పోలీసులే. అయితే కొన్నిసార్లు విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఊహించని ఘటనలు ఎదురవుతాయి. తాజాగా ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఎదురైంది. ఓ యువకుడు బాధతో ఏడుస్తూ రోడ్డుపై నడుస్తూ వస్తున్నాడు. గమనించిన మహిళా కానిస్టేబుల్ ఏమైందని అడిగింది. ఉద్వేగంతో ఆ యువకుడు మహిళా కానిస్టేబుల్‌ను కౌగిలించుకున్నాడు. అయినా ఆమె వారించలేదు. బుగ్గ నిమురుతూ ఓదార్చింది.
ముద్దుపెట్టడంతో షాక్..
ఏం జరిగిందని యువకుడిని అడిగే ప్రయత్నం చేస్తుండగా.. కౌగిలించుకుంటే ఏమీ అనలేదని భావించిన సదరు యువకుడు అందమైన ఆ మహిళా కానిస్టేబుల్ బుగ్గపై ముద్దు పెట్టాడు. ఊహించని ఈ పరిణామంతో ఆ కానిస్టేబుల్ షాక్ అయింది. అయితే అక్కడున్నవారు ఆమె సీరియస్ అయిన నాలుగు వాయిస్తుందనుకున్నారు.
నవ్వుతూ వెళ్లిపోయింది..
యువకుడు చేసిన పనిని సదరు మహిళా కానిస్టేబుల్ ౖలñ ట్‌గా తీసుకుంది అప్పటికే బాధలో ఉన్నాడు కాబట్టి ఏమీ అనలేదు. అక్కడున్నవారు వచ్చి ఆ యువకుడిని అక్కడి నుంచి పంపించారు. మహిళా కానిస్టేబుల్ కూడా నవ్వుతూ బుగ్గలు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ మహిళా కానిస్టేబుల్ వేసుకున్న యూనిఫాం చూస్తే ఈ ఘటన బంగ్లాదేశ్‌లో జరినినట్లు తెలుస్తోంది. అయితే ఇది షూటింగా.. లేక నిజంగానే జరిగిందో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.
నెటిజన్ల కామెంట్స్..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజట్లు కామెంట్ చేస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి కానిస్టేబుల్ అని ఒకరు కామెంట్ చేశాడు. యువకుడు చాలా లక్కీ అని మరోకరు.. బ్యూటిఫుల్ మేడం అని మరొకరు, లిప్ కిస్.. జస్ట్ మిస్ అని మరికొందరు కామెంట్ చేశారు. కొంతమంది మీమ్స్ పెడుతున్నారు.