Romance Competitions: క్రీడలు అనగానే మనకు గుర్తొచ్చేది.. మైదానం.. డ్రెస్ కోడ్.. షూస్.. జట్లు.. ఆటగాళ్లు ఎంపైర్లు.. విన్నర్లు.. ప్రైజ్… ఇవి అన్ని ఆటల్లో ఉంటాయి. ఇప్పు కొత్త క్రీడ.. విచిత్రమైన క్రీడ రాబోతోంది. విచిత్రం అనగానే ఎప్పుడూ చూడంది.. ఆడంది అనుకూనేరు.. ఇది మనకు తెలిసిందే. ఈ ఆటలో ఇద్దరు ఉంటే చాలు.. మైదానం అవసరం లేదు.. ఇక డ్రెస్సులతో సంబంధం లేదు. ఇందులో గెలిచినా… ఓడినా సంతోషిస్తాం.. అంటి గొప్ప క్రీడ ఇది… అదే రతి క్రీడ. దీనిని కూడా ఒక స్పోర్ట్స్‌గా గుర్తించింది స్వీడన్ దేశంలో జూన్ 8 నుంచి చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి.
ఏకాంతంగా జరుపుకునే క్రీడ..
శృంగారం అనేది స్త్రీ, పురుషులు ఏకాంతంగా జరుపుకునే క్రీడ. ఇద్దరి మధ్య జరిగే అద్భుతమైన ప్రక్రియ. ఇప్పుడది ఆటగా మారబోతోంది. ఆ ఆటకూడా పోటీగా మారబోతోంది. స్వీడన్ దేశంలో సెక్స్ చాంపియన్‌షిప్ జరుగబోతోంది. మన దేశంలో సెక్స్ గురించి మాట్లాడడానికే మనం ఇబ్బంది పడతాం. ఎవరితోనూ షేర్ చేసుకోము. కానీ స్వీడన్ దేశం దీనిని క్రీడగా గుర్తించింది. యూరోపియన్ సెక్స్ చాంపియన్‌షిప్ పేరుతో పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. జూన్ 8వ తేదీ నుంచి పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. కొన్ని వారాలపాటు పోటీలు జరుగుతాయి.
రోజుకు ఆరు గంటలు..
ఈ పోటీల్లో పాల్గొనేవారు రోజుకు ఆరు గంటలు శృంగారం చేయాల్సి ఉంటుంది. ముద్దులు, కౌగిలింతలతోపాటు ఫోర్‌ప్లే నుంచి కామసూత్రలోని వివిధ శృంగార భంగిమలన్నీ.. రౌండ్ల వారీగా నిర్వహిస్తారు. ఈ టోర్నీలో పాల్గొనే జంట కనీసం 45 నిమిషాల నుంచి గంటపాటు రతి క్రీడ ఆడాలి. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి 20 జంటలు రిజిస్టర్ చేసుకున్నాయి.
ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం..
ఇక ఈ సెక్స్ చాంపియన్‌షిప్ పోటీలను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. విజేతలను నిర్ణయించేందుకు ముగ్గురు జడ్జీలను కూడా ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఆడియన్స్ కూడా విజేత ఎంపికలో భాగస్వామ్యం చేశారు. జడ్జీలు 70 మార్కులు ఇస్తే ఆడియన్స్ 30 మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. కనీస మార్కులు సాధిస్తేనే నెక్ట్స్ రౌండ్‌కు వెళ్లేలా పోటీల్లో నిబంధన పెట్టారు. ముగ్గురు జడ్జీలు శృంగారంలో పాల్గొంటున్న జంటలను తీక్షణంగా పరిశీలించి విజేతలను ప్రకటిస్తారు.
16 నియమాలు పాటించాలి..
ఇక ఈ టోర్నీలో పాల్గొనే జంటలు కచ్చితంగా నిర్వాహకులు పెట్టిన 16 నియమాలు పాటించాల్సి ఉంటుంది. తమ భాగస్వామిని సెక్స్‌కు ప్రేరేపించడం మొదలు, ఓరల్ సెక్స్, మసాజ్, వివిధ భంగిమలు, భావప్రాప్తి ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ఈ టోర్నీలో భార్య, భర్తలే కాదు. ప్రేమికులు, స్వలింగ సంపర్కులు కూడా పాల్గొనేందుకు నిర్వాహకులు అనుమతించారు. యూరోపియన్ యూనియన్ ప్రజలకు శృంగారంపై అవగాహన కల్పించేందుకే ఈ టోర్నీ నిర్వహిస్తున్నామని స్వీడన్ సెక్స్ ఫెడరేషన్ ప్రకటించింది. సెక్స్ అంటే భయం, అపోహలు ఉన్నవారికి ఈ టోర్నీ ఉపయోగపడుతుందని తెలిపింది.
సెక్స్‌కు ఒక గైడ్‌గా..
శృంగారం అనేది ప్రతి ఒక్కరూ ఆడాల్సిన క్రీడ.. ఇందుకు మానసిక, శారీరక సంసిద్ధత అవసరం. అన్ని క్రీడల్లోలాగే సెక్స్‌కు శిక్షణ అవసరమని, ఈ టోర్నీ సెక్స్‌లో పాల్గొనేవారికి గైడ్‌గా ఉపయోగపడుతుందని స్వీడన్ సెక్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డ్రాగన్ బ్రాడిష్ తెలిపారు.
టోర్నీపై భిన్నాభిప్రాయాలు
సెక్స్ చాంపియన్‌షిప్ టోర్నీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టోర్నీ కారణంగా పిల్లలు చెడిపోతారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది జనాల్లో విచ్చలవిడితనాన్ని, విశ్రుంఖల సెక్స్‌ను పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. శృంగారం అనేది రహస్యంగా ఉండాలని అంటున్నారు. కొంతమంది మాత్రం టోర్నీ బాగుంటుందని పేర్కొంటున్నారు.
ఇప్పటికే పోర్న్ వీడియోలతో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. తాజాగా సెక్స్ టోర్నీ నిర్వహిస్తే అవి మరింత పెరుగుతాయని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా రహస్యంగా జరిగే విషయాలను బహిర్గతం అవుతాయని పేర్కొంటున్నారు. ఇలాంటి టర్నీలను నిషేధించాలని కోరుతున్నారు. మరి టోర్నీ జరుగుతుందో లేదో చూడాలి.