Pawan Kalyan: పవర్ స్టార్ క్రేజ్ మాములుగా ఉండదు. దానికి ఎల్లలు కూడా ఉండవు. అలాగని ఆయన పాన్ ఇండియా స్థాయి సినిమాలు సైతం చేయలేదు. కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. చిన్నాపెద్దా వయోభేదం లేదు. ఈ రాష్ట్రం.. ఆ రాష్ట్రం అన్న తేడాలేదు. దేశ వ్యాప్తంగా అభిమానులు దక్కించుకున్నారు పవన్. చివరకు పాఠ్యాంశాల బోధనలోనూ పవన్ ప్రస్తావిస్తుంటే ఆ అభిమానాన్ని ఏమనాలి. నిత్యం రాజకీయ విమర్శలతో పవన్ వ్యక్తిత్వాన్ని మన రాష్ట్రంలో కించపరుస్తుంటే.. పక్క రాష్ట్రాలు జనసేనానిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాయి. చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో పవన్ పై బోధన సాగిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వరంగల్ నిట్ లో ఈ ఏడాది ఏప్రిల్ 7న నిర్వహించిన స్ప్రింగ్ ఫ్రీ – 2023 ప్రారంభోత్సవ వేడుకకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ నలుమూలలకు చెందిన యువతను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. దేశ భవిష్యత్ గురించి యువతకు పవన్ పలు సూచనలు చేశారు. తాను పెద్దగా చదువుకోలేదని.. కానీ సమాజాన్ని చదువుకున్నానని పవన్ అన్నారు.తాను ఇంటర్ లో ఫెయిల్ అయ్యాయని.. తన స్నేహితులు చిట్టీలు పెట్టుకొని పాసయ్యారని తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యా. కానీ, నైతికంగా నేను విజయం సాధించానని చెప్పారు.మీ సామర్థ్యాలకు తగిన ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను అని ఆకాంక్షించారు. కళ.. ఏ రాష్ట్రానికి చెందినవారినైనా కలుపుతుంది. మానవత్వం, సంస్కృతి ఒక్కటే మనుషులను ఏకం చేస్తుందని తెలిపారు. ఇవి విద్యార్థులను ఆలోచింపజేశాయి.
ఆ మధ్యన తమిళనాడు అసెంబ్లీలో పవన్ ప్రస్తావన వచ్చింది. అక్కడి ప్రభుత్వ పాలనపై పవన్ ప్రశంసించారు. దానిని ప్రస్తావిస్తూ డీఎంకే సభ్యులు మాట్లాడారు. పవన్ ను ఏపీ భావి నాయకుడిగా కీర్తించారు. ఇప్పుడు అదే తమిళనాడులోని సత్యభామ యూనివర్సిటీలో ఏకంగా పవన్ ప్రస్తావనతో విద్యాబోధన సాగుతుండడం ఆశ్చర్యం వేస్తోంది. ఏపీలో అంతటి నాయకుడ్ని పట్టించుకోకున్నా తమిళనాడులో మంచి గౌరవమే దక్కుతుండడంపై జన సైనికులు ఆనందం వ్యక్తం చేశారు. పవన్ అందరివాడని.. అందరి హృదయాల్లో ఉంటాడని కితాబిస్తున్నారు.