ESA: చదువుతుంటే వింతగా ఉంది దూ.. బ్బాబ్బాబూ ఆ ఉద్యోగం ఏమిటో మాకు కూడా జర చెప్పండి.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. ఉద్యోగాలు కోల్పోయి నరకం చూస్తున్నాం అనుకుంటున్నారు కదూ.. వాస్తవానికి ఈ ఉద్యోగం చేయాలంటే పెట్టి ఉండాలి.. ఒంటిమీద మచ్చ వేసుకొని పుట్టి ఉండాలి.. అని అనుకుంటున్నారు కదూ.. మీరు అనుకుంటున్నవన్ని తప్పు.. ఈ ఉద్యోగం చేయాలంటే అదృష్టవంతులై ఉండాల్సిన అవసరం లేదు. ఒంటిమీద మచ్చ వేసుకొని పుట్టాల్సిన పని కూడా లేదు. జస్ట్ తిని పడుకుంటే చాలు. కాకపోతే అందులోనూ కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం నడుచుకుంటే బ్రహ్మాండంగా మీకే ఉద్యోగం ఇస్తారు. అంతేకాదు ప్రతినెల 4.7 లక్షల వేతనం కూడా చెల్లిస్తారు. దీనికి అదనపు ప్రయోజనాలు కూడా జత అవుతాయి.
ప్రతినెల 4.7 లక్షల జీతం
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) పాశ్చాత్య దేశాలలో వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ తో స్పెషల్ బాత్ టబ్ లు తయారు చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ తయారుచేసిన వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ స్పెషల్ బాత్ టబ్ లకు విదేశాలలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే ఈ కంపెనీ ఎప్పటికప్పుడు తను తయారు చేసే ఉత్పత్తుల్లో అద్భుతమైన నాణ్యత ఉండేవిధంగా చూసుకుంటుంది. అందువల్లే ఈ కంపెనీ తయారు చేసే ఉత్పత్తులకు ప్రపంచ దేశాలలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులు తయారు చేయడం ఈ కంపెనీకి మొదటినుంచి ఉన్న అలవాటు. అందువల్లే ఈ కంపెనీ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే తను తయారు చేసిన ఉత్పత్తులు ఎలా ఉండాలో తెలుసుకునేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది.. తను తయారు చేసే ఉత్పత్తులు నాణ్యంగా ఉండాలని భావించి.. సరికొత్త ప్రణాళికకు రూపకల్పన చేసింది. దానికోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది.. తను తయారు చేస్తున్న వాటర్ బెడ్ పై పది రోజులపాటు తిని పడుకుంటే 4.7 లక్షల జీతం చెల్లించనుంది. అంతేకాదు దానికి తగ్గట్టుగా సౌకర్యాలు కూడా కల్పించనుంది. 10 రోజులపాటు ఉద్యోగులు హాయిగా తిని.. నచ్చిన సినిమా చూసి.. కళ్ళు మూతలు పడుతుంటే పడుకోవడమే. ఈ పది రోజులపాటు ఉద్యోగులు ఆ పడక మీద విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అయితే ఆ పడక మీద పడుకున్నప్పుడు మనుషులు ఎంత సుఖంగా ఉన్నారు? వారి దేహంలో అన్ని అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నాయా? వారు సుఖంగా నిద్రపోతున్నారా? గాడ నిద్రలో ఉన్నారా? మగత నిద్రలో ఉన్నారా? అనే విషయాలను కంపెనీ ప్రతినిధులు అంచనా వేస్తూ ఉంటారు. గాడ నిద్రలో ఉంటే కంపెనీ ఉత్పత్తి బాగున్నట్టు.. మగత నిద్రలో ఉంటే ఇంకా మార్పులు చేర్పులు చేయాలనుకున్నట్టు భావిస్తారు. ఆ తర్వాత తమ ఉత్పత్తిని మరింత నవీనకరించి.. మళ్లీ ఉద్యోగులను తిని పడుకోబెడతారు. అయితే అంతరిక్ష ప్రయాణంలో మనిషి శరీరం ఎదుర్కొనే ప్రభావాలను అంచనా వేయడానికి ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది..