Shankaranna Commits Self Destruction: అర్థం చేసుకునే మనసు లేనప్పుడు ఆకర్షించే అందమెందుకు? బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యమే గొప్పది. అర్థం చేసుకునే ఆలి లేకపోతే బతుకంతా వ్యర్థమే. అందుకే అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. ఇల్లు కడితే అప్పులే. పెళ్లి చేసుకుంటే తిప్పలే మిగులుతాయి. ఆయనో పెద్ద మనిషి. వివాహ వయసు దాటిపోవడంతో ఇక పెళ్లెందుకని ఉన్నదాంట్లోనే తృప్తిగా జీవించాలని అనుకున్నాడు. కానీ తానోటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా ఆయన తలరాతే మారిపోయింది. పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలనుకున్నా అతడి జీవితం మాత్రం బొంగరంలా తిరిగిపోయింది. అర్థం చేసుకోలేని అర్థాంగి ఉంటే కోట్లు ఉన్నా నరకమే అని నిరూపించింది.

కర్ణాటక రాష్ట్రంలోని చైడనకుప్పెకు చెందిన శంకరన్న రైతు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఉన్న దాంట్లో తృప్తిగా రెండు పూటలా తింటూ పని చేసుకుంటూ బతుకుతున్నాడు. వివాహం చేసుకునే వయసు కాస్త దాటి పోవడంతో ఇక ఆ గొడవెందుకులే అని ప్రశాంతంగా ఉంటున్నాడు. అయితే ఆయన ప్రశాంతతను పాడు చేయడానికి అన్నట్లు ఓ మహిళ పేరు మేఘన ఆయన జీవితంలోకి ప్రవేశించిది. తనకు తానుగా పరిచయం పెంచుకుని నన్ను వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. ఆయన ససేమిరా అన్న ఆయనతోనే సరే అని ఒప్పించింది. చివరకు వివాహం ఆడింది.
Also Read: Yadadri Special Mini Buses: తెలంగాణ ‘తిరుపతి’ యాదాద్రికి చేరడం ఇక ఈజీ..
ఇక అప్పటి నుంచి ఆయనకు కష్టాలే ఎదురయ్యాయి. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న శంకరన్న భార్య రాకతో ఇబ్బందులు పడ్డాడు. ప్రతి దానికి అడ్డు చెప్పడం. తను అనుకున్నది సాధించడం మొదలుపెట్టింది. దీంతో ఆయనకు మనసు ప్రశాంతంగా ఉండేది కాదు. తరచూ గొడవలకు దిగడంతో దినదినం గొడవ నూరేళ్ల ఆయష్షుగా మారింది అతడి జీవితం. ఈ నేపథ్యంలో ఉన్న ఆస్తిని అమ్ముకుని బెంగుళూరు వెళదామని ఒకటే పోరు. ఇక ఆ పోరు పడలేక ఆయన మనసు గతి తప్పింది.

ఉన్న ఊళ్లోనే మంచి ఇల్లు. వ్యవసాయం ఉండటంతో తాను రాలేనని చెప్పేవాడు. ఆమె మాత్రం తన పంతం నెగ్గించుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చేది. ఉన్న ఊళ్లో తల్లి ఉండటంతో ఆయన ఏం చెప్పలేకపోయేవాడు. ఈ తరుణంలో మంగళవారం ఉదయం శంకరన్న చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. అందుకే అంటారు బ్యూటీఫుల్ వైఫ్ ఈజ్ డేంజరస్ లైఫ్ అని. అందమైన పెళ్లాం దొరికిందనుకుంటే అతడి ప్రాణాలు తీసే పెళ్లాం అని అందరు తిట్టిపోస్తున్నారు.
Also Read: Increased Employment Guarantee Wage Rates : ‘ఉపాధి’కి మార్గం చూపిన కేంద్రం.. ఇక త్వరపడండి