Pakka Commercial Release Date Fixed: హీరో గోపీచంద్ కి ఎలాగైనా హిట్ సినిమా ఇవ్వాలనే కసితో తన క్రియేటివిటీని అంతా గుమ్మరిస్తూ సినిమా చేస్తున్నాడు మారుతి. కాగా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ తమ కలయికలో వస్తున్న “పక్కా కమర్షియల్ ” సినిమా పై మొత్తానికి ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జులై 1వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇక గోపిచంద్ సరసన హీరోయిన్ గా రాశీఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా కోసమే మారుతి ‘పక్కా కమర్షియల్’ గా స్క్రిప్ట్ రాశాడట. మారుతి నుండి మాత్రం మినిమం గ్యారంటీ మూవీని ఆశించొచ్చు,
Also Read: Yadadri Special Mini Buses: తెలంగాణ ‘తిరుపతి’ యాదాద్రికి చేరడం ఇక ఈజీ..
ఇప్పటికే మారుతి ఈ సినిమా విషయంలో వినోదం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చాడు. అయినా అల్లు అరవింద్ కంపెనీ నుండి సినిమా వస్తుందంటే చెప్పాల్సిన పనే లేదు. కాబట్టి ఈ సారి గోపీచంద్ కి మంచి విజయం దక్కుతుందని అనుకోవచ్చు. కాకపోతే, హీరో గోపీచంద్ కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది. వరుస పరాజయాలతో విసిగిపోయాడు.

గోపీచంద్ హీరోగా సీజన్ కి ఒకటి చొప్పున సినిమా రిలీజ్ చేసినా విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే, ఈ సినిమా మార్కెట్ పై డౌట్ గా ఉన్నారు మేకర్స్. పైగా ఈ సినిమాతో పాటు మిగిలిన పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ పోటీలో గోపీచంద్ నిలబడగలడా ?
[…] Sameera Reddy: తెలుగులో హీరోయిన్ సమీరా రెడ్డి చేసింది మూడు సినిమాలే. అయినా టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో ఆమె బలమైన ముద్ర వేసింది. సమీరా రెడ్డి 2005లో వచ్చిన నరసింహుడు మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అశోక్, జై చిరంజీవా చిత్రాలతో సమీరా నటించి మెప్పించింది. అయితే.. తాజాగా సమీరా రెడ్డి ఒక షాకింగ్ విషయం రివీల్ చేసింది. […]
[…] Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ అంటేనే ఊహించని టాస్క్ లతో నిత్యం గొడవలు పడుతూ రచ్చ రచ్చగా సాగుతుంది. అయితే గతంలో కంటే ఈ సారి నాన్ స్టాప్ అంటూ అలరిస్తున్న బిగ్ బాస్.. మరిన్ని కొత్త టాస్క్ లను తీసుకొస్తున్నాడు. అయితే ఈ కొత్త టాస్క్‌లను చూస్తుంటే మాత్రం.. నిత్యం గొడవలు పెట్టడానికే తెస్తున్నాడేమో అనిపిస్తోంది. అంతలా ఉంటున్నాయి ఆ టాస్క్ లు. […]