Homeజాతీయ వార్తలుCM KCR- China Jeeyar: చిన‌జీయ‌ర్ వ‌ద్దు.. కొత్త గురువు అత‌నేనంటున్న కేసీఆర్.. అంతా వ్యూహం...

CM KCR- China Jeeyar: చిన‌జీయ‌ర్ వ‌ద్దు.. కొత్త గురువు అత‌నేనంటున్న కేసీఆర్.. అంతా వ్యూహం ప్ర‌కార‌మే..

CM KCR- China Jeeyar: తెలంగాణ‌లో కేసీఆర్‌కు చిన‌జీయ‌ర్ స్వామికి ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. కేసీఆర్ రాజ‌కీయంగా గానీ లేదంటే ఆధ్యాత్మికంగా గానీ ఏదైనా ప‌నిని మొద‌లు పెట్టాల‌నుకుంటే మాత్రం కచ్చితంగా చిన‌జీయ‌ర్ స్వామి సల‌హాలు తీసుకునే వారు. ఒక‌ప్పుడు కేంద్రంలో ఏమైనా ప‌నులు కావాల‌న్నా కూడా చిన‌జీయ‌ర్ ద్వారానే చేయించుకునేవార‌నే టాక్ ఇప్ప‌టికీ ఉంది.

CM KCR- China Jeeyar
CM KCR- China Jeeyar

కాగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య గ‌త కొంత కాలంగా విభేదాలు వ‌చ్చి గ్యాప్ పెరిగింది. ఇందుకు కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి. తెలంగాణ అంటే శైవ గ‌డ్డ‌గా చెబుతుంటారు. అలాంటి చోట ఈ ఇద్ద‌రూ క‌లిసి వైష్ణ‌వాన్ని పెంచి పోషిస్తున్నార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. దీంతో కేసీఆర్ వైష్ణవాన్ని ప‌క్క‌న పెట్టేసి శైవాన్ని ఎత్తుకోవాల‌ని భావిస్తున్నారంట‌. ఇందులో భాగంగా కేసీఆర్ కొత్త గురువును వెతుక్కుంటున్నారంట‌.

Also Read: Yadadri Special Mini Buses: తెలంగాణ ‘తిరుపతి’ యాదాద్రికి చేరడం ఇక ఈజీ..

అందుకే మొన్న యాదాద్రికి కూడా చిన‌జీయ‌ర్‌ను పిల‌వ‌కుండా.. దూరం పెట్టేశారు. ఇక త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో శైవ ఆల‌యాల పున‌రుద్ధ‌ర‌ణ‌లో ప‌డ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఆల‌యాల‌ను కొత్త గురువు శృంగేరి శార‌ద పీటం అధిప‌తి అయిన భార‌తీ తీర్థ స్వామి ఆద్వ‌ర్యంలో పున‌రుద్ధ‌రించాల‌ని కేసీఆర్ డిసైడ్ అయ్యారంట‌.

శైవ ఆల‌యాలు అయిన వేముల వాడ ఆల‌యాన్ని ఇందులో ముందుగా చేప‌ట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం. తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న స‌మ‌యంలో.. చిన‌జీయ‌ర్‌తో విభేదాలు కేసీఆర్‌కు పెద్ద న‌ష్ట‌మ‌నే చెప్పుకోవాలి. త్వ‌ర‌లోనే క‌ర్ణాట‌క వెళ్లి శృంగేరీ పాఠాధిప‌తిని కేసీఆర్ క‌ల‌వ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆల‌యాల డెవ‌ల‌ప్ మెంట్ విష‌యంపై భార‌తీ స్వామితో చ‌ర్చించ‌నున్నారు కేసీఆర్‌.

CM KCR- China Jeeyar
CM KCR- China Jeeyar

ఇక న‌మ‌స్తే తెలంగాణ తొలి యజమాని సీఎల్ రాజంను కేసీఆర్ మ‌ల్లీ ద‌గ్గ‌ర తీసుకున్నారు. నిన్న యాదాద్రికి ఆయ‌న‌ను కేసీఆర్ వెంట పెట్టుకుని వెళ్లారు. ఇవ‌న్నీ చూస్తుంటే.. రాబోయే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా అన్నీ సిద్ధం చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. హైంద‌వాన్ని బీజేపీ కంటే తానే ఎక్కువ‌గా చూపించాల‌ని కేసీఆర్ డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఇందుకోసం త్వ‌ర‌లోనే కేసీఆర్ మీడియాతో పాటు, ఇటు సోష‌ల్ మీడియాలో కూడా గుడుల విష‌యంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయాల‌ని భావిస్తున్నారంట‌. ఎలాగూ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్నాం కాబ‌ట్టి. అటు కేంద్రంతో, ఇటు చిన‌జీయ‌ర్‌తో విభేదించిన స‌మ‌యంలో.. అన్ని ర‌కాలుగా సిద్ధం కావాల‌ని కేసీఆర్ భావిస్తున్నారంట‌. మ‌రి ఆయ‌న హైంద‌వ వ్యూహం ఏ మేర‌కు ప‌నిచ‌స్తుందో చూడాలి.

Also Read: Increased Employment Guarantee Wage Rates : ‘ఉపాధి’కి మార్గం చూపిన కేంద్రం.. ఇక త్వరపడండి

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

4 COMMENTS

  1. […] KTR Tweets On Gujarat Power Cut: రాజ‌కీయాల్లో ప్ర‌తిపక్ష పార్టీల విష‌యంలో ఏ కొంచెం మిస్టేక్ దొరికినా.. దాన్ని విప‌రీతంగా విమ‌ర్శించేసి.. ప‌దే ప‌దే ప్ర‌చారం చేయ‌డం ఇప్ప‌టి రాజ‌కీయ నేత‌ల‌కు అల‌వాటు. ఈ అల‌వాటు మ‌న‌కు ఎక్కువ‌గా బీజేపీలో క‌నిపిస్తుంది. అయితే మేమేం త‌క్కువా అన్న‌ట్టు ఇప్పుడు టీఆర్ ఎస్ నేత‌లు కూడా ఇదే పంథాను ఎంచుకుంటున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular