Homeటాప్ స్టోరీస్Telangana Assembly Absence KCR Salary Issue: వర్క్ ఫ్రమ్ హోమ్ ‘ప్రతిపక్ష నేత’: అసెంబ్లీకి...

Telangana Assembly Absence KCR Salary Issue: వర్క్ ఫ్రమ్ హోమ్ ‘ప్రతిపక్ష నేత’: అసెంబ్లీకి రాకపోయినా కేసీఆర్ అకౌంట్‌లోకి కోటి రూపాయలు!

Telangana Assembly Absence KCR Salary Issue: సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆప్షన్ ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఒక రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ సభ గడప తొక్కకుండానే “అటెండెన్స్ అక్కర్లేని అసాధారణ ఉద్యోగి” గా కొత్త రికార్డు సృష్టించారు మన గులాబీ బాస్. ‘రాజ్యం పోయినా రాచరికం పోలేదు’ అన్న సామెతను నిజం చేస్తూ గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచే ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్న తీరుపై ఇప్పుడు అసెంబ్లీలో సీఎం […]

Telangana Assembly Absence KCR Salary Issue: సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆప్షన్ ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఒక రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ సభ గడప తొక్కకుండానే “అటెండెన్స్ అక్కర్లేని అసాధారణ ఉద్యోగి” గా కొత్త రికార్డు సృష్టించారు మన గులాబీ బాస్. ‘రాజ్యం పోయినా రాచరికం పోలేదు’ అన్న సామెతను నిజం చేస్తూ గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచే ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్న తీరుపై ఇప్పుడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?

జీతం ఫిక్స్.. రాకపోయినా ‘కటింగ్’ లేదు!

సామాన్యుడు ఒక్క రోజు ఆఫీస్ మానేస్తే జీతంలో కోత పడుతుంది. కానీ మన ప్రతిపక్ష నేత గారికి మాత్రం ఇప్పటి వరకు అక్షరాలా రూ. 1.06 కోట్ల జీతభత్యాలు ప్రభుత్వం చెల్లించింది. సభకు వచ్చి ప్రజా సమస్యలపై గళం ఎత్తాల్సిన బాధ్యతను పక్కన పెట్టి, కేవలం అకౌంట్‌లో పడే మెసేజ్‌లకే పరిమితమైన ఈ ‘రాజకీయం’ చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. “కోటి రూపాయల జీతం తీసుకుంటూ కోలుకోలేని నిద్రలో ఉండటం” అంటే ఇదేనేమోనని చర్చించుకుంటున్నారు.

గవర్నర్ ప్రసంగం ఒకవైపు.. కేసీఆర్ ఫామ్ హౌస్ మరోవైపు!

గవర్నర్ శివప్రతాప్ శుక్లా అసెంబ్లీలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ అంటూ భవిష్యత్ ప్రణాళికలు వివరిస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షం మాత్రం “మేము రాము.. మాకు ఆ విజన్ డాక్యుమెంట్లు పట్టవు” అన్నట్లుగా వ్యవహరించింది. దీనిపై రేవంత్ సెటైర్ వేశారు. ఏఐ (AI) సునామీ రాబోతోందని గవర్నర్ చెబితే, ప్రతిపక్షం మాత్రం ఇంకా పాత రికార్డులే వేస్తోంది. కనీసం విజన్ డాక్యుమెంట్ చదివారా? అంటే.. “మాకు అధికారం పోయిన దుఃఖం చదవడానికే టైమ్ సరిపోవడం లేదు” అన్నట్లుగా ఉందని ఎద్దేవాచేశాడు.

నాలుగు కోట్ల మంది ప్రజలు తమ గొంతుక వినిపిస్తారని అసెంబ్లీ వైపు చూస్తుంటే, ప్రతిపక్ష నాయకుడు మాత్రం గవర్నర్‌కు కనీసం శుభాకాంక్షలు చెప్పడానికి కూడా రాలేదు. సభకు రాకుండా జీతం తీసుకోవడం అనేది ఒక “మాయని మచ్చ” అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అంటే విధులకు హాజరు కాకుండా జీతం తీసుకునే ఈ కొత్త ట్రెండ్‌పై ఇప్పుడు స్పెషల్ క్లాస్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం అనేది ‘కళ’ అయితే.. అందులో కేసీఆర్ గారు ‘ఆస్కార్’ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ ‘కోటి రూపాయల అటెండెన్స్’ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper