నాలుగేళ్లు క్రితం వరకూ ఆ తెలుగు హీరోయిన్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండేది, కానీ కెరీర్ పరంగా తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల, వచ్చిన ఆ క్రేజ్ తో పాటు అవకాశాలు కూడా పోయాయి. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నా.. ఆమె డిమాండ్స్ దెబ్బకు ఆమె క్రేజ్ మరీ పాతాళానికి పడిపోతూ ఉంది. ఎంతలా అంటే ఇప్పుడామెకు సైడ్ క్యారెక్టర్ రావడం కూడా ఎక్కువ అన్నట్టు తయారైంది ఆమె పరిస్థితి. దీనికితోడు కాస్త బొద్దుగా ఉండే ఆ హీరోయిన్, ఈ మధ్య కాస్త స్లిమ్ అయి.. తనకున్న ఆ అందాన్ని కూడా కోల్పోయింది.
Also Read: పాపం.. నయనతారకు మళ్ళీ పెళ్లి !
దాంతో ఆ వచ్చే అవకాశాలు కూడా ప్రస్తుతం అంతంతమాత్రంగా కూడా రావట్లేదట. అసలుకే కెరీర్ బాగాలేదు. ఇలాంటి బ్యాడ్ టైమ్ లో ఆ హీరోయిన్, తాజాగా డేటింగ్ రూమర్స్ తో మళ్ళీ వార్తల్లోకెక్కింది. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అంటే.. అంజలి. కోలీవుడ్ కు చెందిన ఓ వ్యక్తితో ప్రస్తుతం హీరోయిన్ అంజలి డేటింగ్ చేస్తోందంటూ కొత్తగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ పుకార్లుల్లో వాస్తవాలు ఎన్ని అనే విషయాలు పక్కన పెడితే.. తన పై వచ్చే ఆ రూమర్స్ కి క్లారిటీ ఇస్తూ.. తనకున్న బ్యాడ్ ఇమేజ్ ను మేనేజ్ చేసుకోవడం కూడా రావట్లేదు అంజలికి.
Also Read: చివరికీ.. వేశ్యగా తెలుగు హీరోయిన్ !
ఇంతకీ అంజలి ఎవరితో డేటింగ్ లో ఉంది అంటే.. కోలీవుడ్ స్మాల్ హీరో అని కొందరు, లేదు ఓ యంగ్ దర్శకుడితో అని మరికొందరు వాదిస్తున్నారు. అయినా, ముదురుపోయిన ఈ హీరోయిన్ ఎవరితో లవ్ లో పడితే ఏముంది ? అయినా అంజలికి లవ్ స్టోరీ ఏమైనా కొత్తనా ఏమిటి ? గతంలోనే ఈ ముద్దుగుమ్మ ఓ తమిళ హీరోతో డేటింగ్ వ్యవహారం నడిపింది. కానీ కొన్నాళ్లకు ఆ బంధం బెడిసికొట్టి.. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా మరో రిలేషన్ షిప్ స్టార్ట్ చేసిందనుకుంటా. చూద్దాం ఇది ఎన్నాళ్ళు ఉంటుందో.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: That heroine fell in love again
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com