Betting Apps Case : సోషల్ మీడియా లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే సెలబ్రిటీల పై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తుంది. ఇప్పటికే బన్నీ సన్నీ యాదవ్(Bunny Sunny Yadav), హర్ష సాయి(Harsha Sai) వంటి ప్రముఖుల పై కేసులు నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు ఏకంగా 11 మంది సెలబ్రిటీల పై కేసులు నమోదు చేసారు. ఆ 11 మంది లో బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss 8 Telugu) లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న విష్ణు ప్రియ(Vishnu Priya), టేస్టీ తేజ(Tasty Teja), వంటి వారు ఉన్నారు. ఈ లిస్ట్ లో యాంకర్ శ్యామల(Anchor Shyamala) కూడా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్యామల ఇటీవలే వైసీపీ పార్టీ లో చేరి, ముఖ్య నాయకురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లపై ఆమె ఎన్నో కామెంట్స్ చేసింది. వాళ్ళను అనేక సందర్భాలలో తీవ్రంగా విమర్శించింది కూడా.
Also Read : హర్ష సాయిపై కేసు.. మరి యాంకర్/వైసీపీ లేడి నేతను మరచిపోతారా?
అందుకే సోషల్ మీడియా లో శ్యామల గతంలో బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేసినటువంటి వీడియోస్ ని పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రమోట్ చేసారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈమె వీడియో నే కనిపించేది. దీంతో శ్యామల పై కేసు నమోదు అయ్యింది. ఈ ముగ్గురు కాకుండా సోషల్ మీడియా లో యువతలో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న రీతూ చౌదరి(Rithu Chowdary) పై కూడా కేసు నమోదు అయ్యింది. ఈమె కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఎన్నోసార్లు బెట్టింగ్స్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ కనిపించింది. అదే విధంగా ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత పై కూడా కేసు నమోదు అయ్యింది. వీళ్ళతో పాటు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్ వంటి వారు కూడా ఉన్నారు. వీళ్లందరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. కచ్చితంగా ఈ కేసు లో అరెస్ట్ చేయడమో, లేదా కౌన్సిలింగ్ ఇవ్వడమో చేస్తారని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
అసలే IPL సీజన్ మొదలు అవుతుంది. బెట్టింగ్ యాప్స్ యజమానులు సెలబ్రిటీస్ ని తమ యాప్స్ ని ప్రమోట్ చేయమని గట్టిగా ఆఫర్స్ ఇస్తున్నారు. అందుకే పోలీసులు పసిగట్టి గతంలో బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేసిన వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారు. సోషల్ మీడియా లో లక్షల మందిని ప్రభావితం చేసే ‘నా అన్వేషణ’ ఫేమ్ అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వారిని వెలికి తీసి పోలీసుల దృష్టికి చేరేలా చేస్తున్నాడు. వారం రోజుల క్రితమే ఆయన VC సజ్జనార్ తో ఈ అంశం పై లైవ్ వీడియో చాట్ చేయడం పెద్ద సంచలనం గా మారింది. పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్స్ కి ప్రొమోషన్స్ చేశాడని అన్వేష్ అంటున్నాడు కానీ, అతని పై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.