Tollywood: టాలీవుడ్ లో ప్రస్తుత రీ రిలీజ్ సినిమాలు కొత్త సినిమాలతో సమానంగా వసూళ్లను రాబడుతూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక విధంగా సినిమాలు లేని సమయం లో థియేటర్స్ కి ఈ రిలీజ్ చిత్రాలు ఇచ్చే బూస్ట్ మామూలుది కాదు. పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్, ఆ తర్వాత ‘జల్సా’ తో తారాస్థాయికి చేరింది. ఇక ఆ తర్వాత అందరి హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి కానీ, చివరికి మహేష్ బాబు(Superstar Mahesh Babu), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లదే పై చెయ్యి గా నిల్చింది. అయితే ఇప్పటి వరకు విడుదలైన రీ రిలీజ్ చిత్రాలలో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాలేంటో ఒకసారి చూద్దాము.
మురారి(Murari 4K):
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే ఈ చిత్రం ఫ్యామిలీ జానర్ సినిమాలకు ఆదర్శంగా నిలిచి ఆల్ టైం కల్ట్ క్లాసిక్ గా నిల్చింది. గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు 5 కోట్ల 41 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, క్లోజింగ్ లో 8 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టి నెంబర్ 1 స్థానం లో నిల్చింది.
గబ్బర్ సింగ్(Gabbarsingh 4K) :
పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్య మంత్రి అయ్యాక, ఆయన పుట్టినరోజు నాడు విడుదలైన సినిమా ఇది. మొదటి రోజు ఏకంగా 7 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 8 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సోమవారం రోజున విడుదలైంది, మురారి చిత్రం వీకెండ్ లో విడుదలైంది. గబ్బర్ సింగ్ కూడా మురారి లాగానే వీకెండ్ లో విడుదల అయ్యుంటే, ఎవ్వరూ అందుకోలేని రేంజ్ లో గ్రాస్ వసూళ్లను క్లోజింగ్ లో పెట్టేది, సోమవారం రోజున విడుదల అవ్వడం వల్లే క్లోజింగ్ లో టాప్ 1 కి చేరుకోలేకపోయింది.
ఖుషి(Kushi 4K):
2022 డిసెంబర్ 31 న విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు 4 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, క్లోజింగ్ లో 7 కోట్ల 46 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. చాలా కాలం వరకు ఈ సినిమా మొదటి రోజు మరియు క్లోజింగ్ వసూళ్లు చెక్కు చెదరకుండా ఉన్నింది. మురారి చిత్రం ఈ రికార్డు ని బ్రేక్ చేసింది.
బిజినెస్ మ్యాన్(Businessman 4K) :
ఇక నాల్గవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ చిత్రం నిల్చింది. మొదటి రోజు ఈ చిత్రానికి 5 కోట్ల 27 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, క్లోజింగ్ లో 5 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఈ సినిమాకి కూడా గబ్బర్ సింగ్ కి ఎదురైనా పరిస్థితే ఎదురైంది.
ఆరెంజ్(Orange 4K):
రామ్ చరణ్ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ఈ సినిమాకి రీ రిలీజ్ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి రీ రిలీజ్ లో 3 కోట్ల 36 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి , రెండవ రీ రిలీజ్ లో కోటి 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రీసెంట్ గా విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి క్లోజింగ్ లో 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.