Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ దేశంలోనే క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన చేసింది కేవలం మూడు సినిమాలే. బడా బడా స్టార్స్ ఆయనతో మూవీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్ రెడ్డి టేకింగ్, క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటాయి. ఇంటెన్స్, వైల్డ్ యాటిట్యూడ్ తో కూడిన పాత్రలు ఆయన సినిమాల్లో మనం చూడొచ్చు. అర్జున్ రెడ్డి కథ తెరపైకి తేవడానికి సందీప్ రెడ్డి చాలా కష్టపడ్డారు. ఆయన్ని ఎవరూ నమ్మలేదు. ఓ హీరో కోసం దాదాపు మూడేళ్లు ఎదురు చూశాడట.
హీరో దొరకడం లేదు, నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఏదైతే అది అయ్యిందని.. అప్పుడే హీరోగా ఎదుగుతున్న విజయ్ దేవరకొండను ఎంచుకున్నాడు. తానే స్వయంగా నిర్మించాలని ఫిక్స్ అయ్యాడు. అర్జున్ రెడ్డి మూవీని సందీప్ రెడ్డి రూ. 2.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడట. ఎడిటింగ్ సమయంలో చాలా మంది సందీప్ రెడ్డికి నిడివి తగ్గించాలని సూచించారట. కనీసం 10 నుండి 20 నిమిషాలు తొలగించు. హిట్ మూవీ అవుతుంది అన్నారట.
సినిమాలు నిడివి వలన ప్లాప్ కావు, కంటెంట్ వలన ప్లాప్ అవుతాయని సందీప్ రెడ్డి అన్నారట. ఇక నీ కర్మ అని వదిలేశారట. సందీప్ రెడ్డి తాను అనుకున్న ప్రకారం సినిమాను ఎడిట్ చేసి విడుదల చేశారు. 2017లో థియేటర్స్ లోకి వచ్చిన అర్జున్ రెడ్డి సెన్సేషన్ సృష్టించింది. వరల్డ్ వైడ్ ఈ మూవీ రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అయితే వివాదాలు రాజేసింది. సినిమా విజయాన్ని మాత్రం ఎవరూ ఆపలేదు.
విజయ్ దేవరకొండకు జంటగా షాలిని పాండే నటించింది. అర్జున్ రెడ్డి మూవీని హిందీలో కబీర్ సింగ్ గా రిమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు సందీప్ రెడ్డి. షాహిద్ కపూర్ కెరీర్లో కబీర్ సింగ్ అతిపెద్ద హిట్. రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో ఆ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. షాహిద్ కపూర్ కి భారీ బ్రేక్ ఇచ్చాడు సందీప్ రెడ్డి.
Also Read : యానిమల్ లో అందుకే రణ్ బీర్ ను బట్టలిప్పి నిలబెట్టించాను : సందీప్ వంగా
Web Title: Sandeep reddy vanga arjun reddy plop movie analysis
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com