spot_img
HomeతెలంగాణTelangana Destination Wedding Hub: తెలంగాణ అడవులు.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కేంద్రాలు

Telangana Destination Wedding Hub: తెలంగాణ అడవులు.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కేంద్రాలు

Telangana Destination Wedding Hub: నేటి తరానికి పెళ్లి అంటే కేవలం ఒక వేడుక కాదు.. అది జీవితంలోని గుర్తుండిపోయే అనుభవం కావాలి. అందుకే యువజంటలు సంప్రదాయ హాల్‌ లేదా గుడి వివాహాలకు బదులు ప్రకృతి, విలాసం, ప్రశాంతత కలగలిసిన ప్రదేశాలను కోరుకుంటున్నారు. పెళ్లి వేడుకను స్మరణీయంగా మార్చాలనే ఆకాంక్ష ఇప్పుడు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు బలమైన పునాది అయింది.

తెలంగాణ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ హబ్‌..
గతంలో గోవా, కేరళ, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలు పెళ్లి ప్రదేశాల ప్రధాన గమ్యస్థానాలుగా ఉన్నప్పటికీ, ఇప్పుడు తెలంగాణ కూడా ఆ జాబితాలో చోటు సంపాదిస్తోంది. రాష్ట్ర పర్యాటక శాఖ దీనిని ప్రణాళికాత్మకంగా అభివృద్ధి చేస్తోంది.

అనంతగిరి అడవులు (వికారాబాద్‌)..
ప్రకృతి సోయగాలు, అందమైన కొండలు, ప్రశాంత వాతావరణం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇక్కడ లగ్జరీ రిసార్టులు, వివాహ వేదికలు, ఫొటోగ్రఫీ స్పాట్లు రూపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.

గోల్కొండ ప్రాతం..
చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ ప్రాంతంలో తారామతి బారాదరిలో ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం జరగనుంది. ఇది వైభవంగా వివాహ వేడుకలు జరపడానికి అన్నివిధాలుగా అనుకూలం.

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌..
ప్రకృతి మాదిరిగా లగ్జరీ అనుభూతిని ఇచ్చే రిసార్టులు ఇక్కడ ప్రతిష్టించబడతాయి. ప్రకతి మధ్యలో వివాహం అనే ఆలోచన పర్యాటకులకు అదనపు ఆకర్షణ.

నాగార్జునసాగర్‌ బుద్ధవనం..
ఆధ్యాత్మిక వాతావరణం కలిగిన ఈ ప్రాంతంలో ధ్యాన కేంద్రాలు, ఎకో రిసార్టులు ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.

ఉపాధి అవకాశాలు..
ఈ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 30 ఎంఓయూలు కుదుర్చింది. వీటి ద్వారా సుమారు 30 వేల మందికి పైగా నేరుగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. పర్యాటక రంగానికి ఇది ఒక పెద్ద మలుపు కాబడనుంది. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు, వెడ్డింగ్‌ టూరిజం ద్వారా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే తెలంగాణ కేవలం ఐటి కేంద్రమే కాకుండా హెరిటేజ్, నేచర్‌ మరియు లగ్జరీ వెడ్డింగ్‌ టూరిజం రంగాల్లో కూడా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక్కడి అడవులు, సరస్సులు, చారిత్రక కట్టడాలు కలగలసి తెలంగాణను ‘‘వివాహ గమ్యం’’గా మలచగలవని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper