HomeతెలంగాణStray Dogs attack Child: మరో బాలుడిని బలితీసుకున్న శునకాలు.. నోరు మెదపని జంతు ప్రేమికులు!

Stray Dogs attack Child: మరో బాలుడిని బలితీసుకున్న శునకాలు.. నోరు మెదపని జంతు ప్రేమికులు!

Stray Dogs attack Child: కుక్కల దాడులు తెలంగాణలో తీవ్రమవుతున్నాయి. దేశంలో కూడా కుక్క కాటుతో చనిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో సుప్రీం కోర్టు కుక్కలను రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించాలని ఆదేశించింది. దీనిపై జంతు ప్రేమికులు గగ్గోలు పెట్టారు. కుక్కలను తరలిస్తే అవి ఎలా బతుకుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పును సైతం తప్పు పట్టారు. కానీ, కుక్కలపై చూపుతున్న ప్రేమలో పది శాతం కూడా కుక్కకాటు బాధితులపై చూపడం లేదు. కుక్కల దారిలో […]

Stray Dogs attack Child: కుక్కల దాడులు తెలంగాణలో తీవ్రమవుతున్నాయి. దేశంలో కూడా కుక్క కాటుతో చనిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో సుప్రీం కోర్టు కుక్కలను రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించాలని ఆదేశించింది. దీనిపై జంతు ప్రేమికులు గగ్గోలు పెట్టారు. కుక్కలను తరలిస్తే అవి ఎలా బతుకుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పును సైతం తప్పు పట్టారు. కానీ, కుక్కలపై చూపుతున్న ప్రేమలో పది శాతం కూడా కుక్కకాటు బాధితులపై చూపడం లేదు. కుక్కల దారిలో పసివాళ్లు మరణిస్తున్నా మానవత్వం లేనట్లుగా మౌనం వహిస్తున్నారు. తాజాగా తెలంగాణలోని జగత్యాల జిల్లాలో కుక్కలు మరో బాలుడిని బలి తీసుకున్నాయి.

రేబిస్‌తో బాలుడు మృతి..
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామానికి చెందిన 7–8 ఏళ్ల మణితేజ్‌కు 2024 డిసెంబర్‌ 26న ఎడమ మెడపై వీధి కుక్క కరిచింది. వెంటనే హైదరాబాద్‌లో రేబిస్‌ టీకాలు వేయించారు. సంక్రాంతి సెలవుల తర్వాత జ్వరం, శ్వాస కష్టాలు ప్రారంభమయ్యాయి. వెన్నెముక నుంచి మెదడుకు వ్యాధి వ్యాపించింది. జగిత్యాల ప్రైవేట్‌ ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌ కార్పొరేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. వెంటిలేటర్‌పై 15 నెలలు చికిత్స అందించారు. ఇందుకు కుటుంబం రూ.50 లక్షల నుంచి రూ.65 లక్షలు ఖర్చు చేసింది. అయినా రికవరీ కాలేదు. చివరకు ఇటీవల బాలుడు కన్నుమూశాడు.

రేబిస్‌ వ్యాధి ప్రమాదం
రేబిస్‌ వైరస్‌ కాటు ద్వారా మెదడుకు చేరి మారణకరమవుతుంది. టీకాలు వేసినా, వైరస్‌ వెన్నెముక ద్వారా వ్యాపిస్తే చికిత్స కష్టం. ఇది 100% నివారించే వ్యాధి అయినా, సమయం ముఖ్యం. కాటు తర్వాత 24 గంటల్లోపు సబ్బుతో కడిగి, యాంటీ–రేబిస్‌ గ్లోబ్యులిన్, 4–5 డోసుల టీకాలు తీసుకోవాలి.

తెలంగాణలో వీధి కుక్కల సంఖ్య పెరుగుతోంది. రేబిస్‌కు సంబంధించి ఉచిత టీకా కేంద్రాలు, కుక్కల నియంత్రణ కార్యక్రమాలు బలోపేతం చేయాలి. ఇటువంటి ఘటనలు పెరిగితే ప్రజా ఆరోగ్య సమస్యగా మారతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper