CM Revanth Reddy (1)
CM Revanth Reddy: కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ – రేవంత్ రెడ్డికి కాస్త గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. మిగతా సందర్భాల్లో పాలు, పంచదార లాగే సాగిపోతోంది. పార్టీపై రేవంత్ రెడ్డి ఒకరకంగా పూర్తిస్థాయిలో పట్టు సాధించారని చెప్పవచ్చు. కొన్ని శాఖల మీద మాత్రం ఇప్పటికి.. ఇద్దరు ముగ్గురు మంత్రుల మీద కూడా రేవంత్ రెడ్డి పెత్తనం సాధించలేకపోతున్నారు. ఇది ఒకరకంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. అధిష్టానం ఒత్తిడి వల్లే ఇదంతా జరుగుతోందని సమాచారం.. ఇక రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా దాదాపు ఏడాది పరిపాలనను పూర్తిచేసుకున్నారు. విజయవంతంగా రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. పథకాల విషయంలో కొన్ని అమలు చేస్తున్నప్పటికీ.. మిగతా వాటికి సంబంధించి అమలు అంతంతమాత్రమే జరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వంపై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని.. ఇప్పుడు అమలు చేయడంలో విఫలమవుతున్నారని మండిపడుతోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన సాగించలేరని.. వచ్చేసారి భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా శనివారం స్పష్టత ఇచ్చారు..
Also Read: కాళేశ్వరం గొప్పతనమే అదీ.. కాంగ్రెస్ తప్పు తెలుసుకుందా?
రెండోసారి కూడా ముఖ్యమంత్రి నేనే
ఇప్పటికే ఏడాది పాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వచ్చేసారి జరిగే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని.. తను ముఖ్యమంత్రి అవుతానని నిండు శాసనసభ వేదికగా ప్రకటించారు. ” అనుమానమే లేదు.. ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను. నేరుగా ముఖ్యమంత్రి అయ్యాను. ఏడాదిపాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేశాను. ఇంకా నాలుగు సంవత్సరాల పాటు పరిపాలన సాగించాల్సి ఉంది. వచ్చే టర్మ్ కూడా నేనే ముఖ్యమంత్రి అవుతానని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది? అనే ప్రశ్న తెలంగాణ రాజకీయాలలో వ్యక్తమౌతోంది. రేవంత్ రెడ్డి పై భారత రాష్ట్ర సమితి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వపరంగా లోటుపాట్లు కనిపిస్తున్నప్పటికీ.. రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అయితే భారత రాష్ట్ర సమితి క్షేత్రస్థాయిలో బలం కోల్పోయిందని.. కాంగ్రెస్ పార్టీ బలాన్ని అలాగే ఉంచుకుందని.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందని.. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుందని.. అందువల్లే రేవంత్ రెడ్డి ఆ తరహా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తన తరఫున అభ్యర్థిని పోటీలో దించలేదు. అందువల్లే రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి.. తన నాయకత్వాన్ని అధిష్టానం ముందు ఉంచి.. ముఖ్యమంత్రి అవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ రెండవ సారి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే… తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన రెండవ వ్యక్తిగా రేవంత్ రెడ్డి నిలుస్తారు. ఎందుకంటే 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా కెసిఆర్ రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలపాటు పరిపాలన సాగించారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Revanth reddy i am the chief minister for the second time what is so confident about revanth reddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com