HomeతెలంగాణTelangana : సర్కార్‌ తెలంగాణది.. ఆధిపత్యం కేంద్రానిది..

Telangana : సర్కార్‌ తెలంగాణది.. ఆధిపత్యం కేంద్రానిది..

Telangana : తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే, ఆ పార్టీకి రాజకీయంగా లాభమా, నష్టమా అని ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే, కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Govenment) అయినప్పటికీ, దాని చుట్టూ కేంద్రమే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైకమాండ్‌ను కలవడానికి మాత్రమే ఢిల్లీ వెళ్లేవారు. కానీ, రేవంత్‌ రెడ్డి హైకమాండ్‌ను కలవడం కంటే కేంద్ర మంత్రులతో భేటీల కోసమే ఎక్కువగా వెళ్తున్నారు. ప్రధానమంత్రిని కలిసేందుకు ఆయన తరచూ ప్రయత్నిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా వెళ్లి కలుస్తూ వస్తున్నారు. అంతేకాక, కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చినప్పుడు వారిని ఇంటికి ఆహ్వానించి సన్మానిస్తున్నారు. అలా కుదరనప్పుడు విమానాశ్రయానికి(Airport) పంపి స్వాగతం పలుకుతున్నారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkatareddy) కూడా తనకు పరిచయం ఉన్న కేంద్ర నేతలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా వెళ్లి కలిసి, పరిచయాలను విస్తరించుకుంటున్నారు.

Also Read : తెలంగాణలో కొలువుల జాతర.. వరుసగా ఫలితాల ప్రకటన.. నిన్న గ్రూప్‌ 1, నేడు గ్రూప్‌ 2, రేపు..?

మళ్లీ ఢిల్లీకి..
మంగళవారం (మార్చి 11, 2025) మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఇతర మంత్రులు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఎవరితోనైనా భేటీ అవుతామని రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనల వల్లే కొన్ని పనులు సాధ్యమవుతున్నాయని వారి వాదన. అయితే, కాంగ్రెస్‌ మంత్రులు, సీఎం ఇలా అవసరానికి మించి కేంద్రంతో సన్నిహితంగా ఉంటున్నారని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తే, రాష్ట్ర నేతలకు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయినప్పటికీ, తమ నిజాయితీపై హైకమాండ్‌కు ఎలాంటి సందేహం రాదన్న నమ్మకంతో కాంగ్రెస్‌(Congress) నేతలు తమ పనులను కొనసాగిస్తున్నారు. కానీ, కొన్ని విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం తమ చేతుల్లోంచి జారిపోతుందేమోనన్న ఆందోళన హైకమాండ్‌లో కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Also Read : ఒక మంత్రికి, ముఖ్యమంత్రికి కేబినెట్ మీటింగ్ లో గొడవట.. బాంబు పేల్చిన బీజేపీ

RELATED ARTICLES

Most Popular