Telangana Government: తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టింది. బీఆర్‌ఎస్(BRS) హయాంలో ఆగిపోయిన పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు నిర్వహించిన వాటి ఫలితాలు ప్రకటించి పోస్టింగ్ ఇచ్చింది. తాజాగా గ్రూప్-1, 2 ఫలితాలు ప్రకటించింది. గ్రూప్-3 ఫలితాలు మార్చి 12న ప్రకటించనుంది. ఈ క్రమంలో నిరుద్యోగుల కోసం మరో కొత్త పథకానికి(New Scheam) శ్రీకారం చుట్టింది.
Also Read: ఎట్టకేలకు ‘బాహుబలి 2 ‘ ని దాటేసిన ‘చావా’..’పుష్ప 2′ ని అందుకోవాలంటే ఇంకా ఎంత గ్రాస్ రావాలో తెలుసా!
తెలంగాణలో నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక కొత్త పథకం “రాజీవ్ యువ వికాస పథకం”(Rajeev Yuva Vikas). ఉదో‍్యగ ప్రకటనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాడి ఏడాదైనా నిరుద్యోగులకు భృతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల్లో నిరాశ నెలకొంది. దీనిఫలితంగా ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduate MLC) ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు కొత్త పథకం తీసుకువచ్చింది.
పథకం వివరాలు:
ప్రారంభం: తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని రూ. 6 వేల కోట్ల బడ్జెట్‌తో ప్రారంభిస్తోంది.
లక్ష్యం: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించడం, వారి ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడం.
దరఖాస్తు విధానం:
దరఖాస్తుల స్వీకరణ మార్చి 15 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
అమలు తేదీ: జూన్ 2న లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు అందించబడతాయి.
అమలు సంస్థలు: ఈ పథకం ఎస్సీ (షెడ్యూల్డ్ కులాలు), ఎస్టీ (షెడ్యూల్డ్ తెగలు), మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేయబడుతుంది.
ప్రయోజనాలు..
ఈ పథకం ద్వారా యువతకు వ్యాపారం లేదా స్వయం ఉపాధి కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆర్థిక సహాయం, శిక్షణ, మార్గదర్శకత్వం అందించే అవకాశం ఉందని అంచనా. ఇది తెలంగాణలో యువత ఆర్థికాభివృద్ధికి మరియు ఉపాధి సృష్టికి దోహదపడవచ్చు.